
చలికాలంలో కూడా భారీ ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ ప్రజలకు వరుణుడు భారీ ఊరట కల్పించాడు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే కాప్రా, ఘట్‌కేసర్, కీసర, అన్నోజిగూడ, దమ్మాయిగూడ, నాగారం, బోడుప్పల్, రాంపల్లి, పీర్జాదిగూడ, మేడిపల్లి, చర్లపల్లిలో ఏరియాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.
పశ్చిమ, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన నానక్‌రామ్‌గూడ, మణికొండ, షేక్‌పేట్, టోలీచౌకిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అలాగే నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బి నగర్, హయత్‌నగర్, బిఎన్ రెడ్డి, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎస్‌ఇసి-బిఎడి, హిమాయత్‌నగర్, నాచారంలో కూడా వర్షం కురుస్తుంది.
అయితే ఆఫీస్‌లు వదిలే సమయం కావడంతో వాహనాలన్ని ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ఏరియాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్ ఏరియాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.