హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..

ఎల్‌నినో ప్రభావంతో నవంబర్‌ చివరి నాటికి హైదరాబాద్‌ రిజర్వాయర్లు ఎండిపోతాయని, నగరంలో నీటి సరఫరా నిలిచిపోతుందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఈ సందేశం అధికారికంగా జారీ చేసినది కాదని స్పష్టం చేసింది. నిర్ధారణలేని వాట్సాప్‌ సందేశాలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయవద్దని ప్రజలకు సూచించింది. నీటి సరఫరాపై తాజా సమాచారం కోసం జలమండలి అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని కోరింది.

హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
Hyderabad Water Supply

Updated on: Oct 13, 2026 | 8:59 AM

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా ఫేక్ ప్రచారం జరుగుతోంది. తాజాగా.. తెలంగాణ, హైదరాబాద్ నగరంలో అలాంటి ఒక ప్రచారం సంచనంగా మారింది. నవంబర్‌ చివరికి రిజర్వాయర్లు ఎండిపోతాయని.. నీటికి కటకట అవుతుందని సామాజిక మధ్యమాల్లో మెస్సెజ్ వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ జలమండలి స్పందించింది. అదంతా అబద్దమని.. నమ్మొద్దంటూ సూచించింది. ఈ మేరకు జలమండలి ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి సందేశాలను ఫార్వర్డ్‌ చేయవద్దని.. అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

‘‘ఎల్‌నినో ప్రభావం, రాబోయే కరవు కారణంగా నవంబర్‌ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, హైదరాబాద్‌లో నీటి సరఫరా పరిమితం అవుతుందని లేదా నిలిచిపోతుందని పేర్కొంటూ వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సందేశాన్ని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (జలమండలి) జారీ చేయలేదు..

రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆ సందేశంలో పేర్కొన్న సమాచారం అధికారికం కాదు. జలమండలి పేరుతో వచ్చే నిర్ధారణలేని సందేశాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సరఫరా, పొదుపుపై సూచనలు జలమండలి అధికారిక ప్రకటనలు, సమాచార మార్గాల ద్వారానే తెలుసుకోవాలి. నీటిని బాధ్యతగా వినియోగించి పొదుపు చేయాలని జలమండలి ప్రజలను కోరుతోంది.’’ అంటూ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us