Hyderabad: హైదరాబాద్ ప్రజలు బీ అలర్ట్.. దుర్గామాత నిమజ్జనాల వేళ ఈ రూట్లలో వెహికల్స్ బంద్..

దసరా నవరాత్రులు ముగియడంతో హైదరాబాద్‌లో దుర్గామాత నిమజ్జనాలు మొదలయ్యాయి. నేటి నుంచి నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో నగరంలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. వీటి గురించి అధికారికంగా ఒక ప్రకటన జారీ చేశారు. వాహనదారులు వీటిని పాటించాలని కోరారు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలు బీ అలర్ట్.. దుర్గామాత నిమజ్జనాల వేళ ఈ రూట్లలో వెహికల్స్ బంద్..
Hyderabad

Updated on: Oct 21, 2026 | 5:54 PM

దసరా నవరాత్రులు ముగియడంతో హైదరాబాద్‌లో దుర్గామాత నిమజ్జనాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. రాబోయే మూడ్రోజుల పాటు పలు రూట్లలో ట్రాఫిక్ దారి మళ్లించనున్నట్ల తెలిపారు. ఈ మేరకు పోలీసులు వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు. దుర్గామాత నిమజ్జనాల క్రమంలో తమకు సహకరించాలని కోరారు. పీపుల్ ప్లాజా, సంజీవయ్య పార్క్, గార్డెన్ పాయింట్, జలవిహార్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న క్రమంలో.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి వాహనాలను దారి మళ్లించనున్నారు.

అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. దుర్గామాత విగ్రహల నిమజ్జనాల క్రమంలో ఖైరతాబాద్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. దీంతో వాహనదారులు ముందుగానే గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనదారులను వి.వి విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు దారి మళ్లించనున్నారు. ఇక నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ వద్ద రవీంద్ర భారతి, మాసబ్ ట్యాంక్ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక్బాల్ మినార్ నుంచి సచివాలయం జంక్షన్ వైపు ట్రాఫిక్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.

ఖైరతాబాద్ బడా గణేష్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలను అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద మింట్ కాంపౌండ్, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు దారి మళ్లించనున్నారు. అలాగే లిబర్టీ నుంచి సచివాలయం జంక్షన్ వైపు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. పాత అంబేడ్కర్ విగ్రహం నుంచి సచివాలయం జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గంలో సాధారణ వాహనాలను అనుమతి ఉండదు. ఈ మార్గంలో కేవలం దుర్గామాన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. వాహనదారులు ఏమైనా సందేహాలు ఉంటే 9010203626 నంబర్లను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us