AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku: ఆహా.. పర్వతాల మధ్యలో జర్నీ.. ఈ అద్దాల రైలు నుంచి అరకు అందాలు చూస్తే స్వర్గమే..

అద్దాల మేడ లాంటి రైలు కోచ్ నుంచి అరకు అందాలని చూడాలని ఉందా..? పార్వతాలు, లోతైన లోయలు జలపాతాలను వీక్షించాలని ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేశాఖ ప్రత్యేక అద్దాల కోచ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోచ్ నుంచి అరకు అందాలను చూస్తే అద్బుతం అనాల్సిందే..

Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 4:51 PM

Share
పండుగల సీజన్ కావడంతో స్కూల్స్, ఆఫీసులకు సెలవులు రావడంతో చాలామంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వేకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో దీపావళి సెలవులు వస్తుండటంతో ఏదైనా టూర్‌కు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో టూర్ అనగానే అరకు చాలామందికి గుర్తుకొస్తుంది. ఏపీ ఊటీగా ప్రసిద్ది పొందిన అరకు అందాలను చూసేందుకు వేలామంది పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ శుభవార్త తెలిపింది.

1 / 5
విశాఖపట్నం-కిరందడూర్ ప్యాసింజర్ రైలుకు అదనంగా విస్టాడోమ్ కోచ్‌ను జోడించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అద్దాల్లోనుంచి అరకు అందాలను ఈ ట్రైన్‌లో చూడవచ్చు. అక్టోబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆ అదనపు కోచ్ జత చేయనున్నారు. ఈ ట్రైన్(58501) విశాఖ నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి.. ఉదయం 11 గంటలకు అరకు చేరుకుంటుంది.

2 / 5
సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, మల్లీవీడు, శృంగవరపుకోట, బొడ్డువార, చిమిడిపల్లి, బొర్రా గుహలు, కారకవలస, షిమిలిగూడ మీదుగా అరకు వెళ్తుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణించేవారు పచ్చని అడవులు, జలపాతాలు, బొర్రా గుహలు, సొరంగాలు, లోతైన లోయలు వంటి ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఈ రైల్లో వెళ్లేవారు ట్రైన్‌లోని అద్దాల్లోనుంచి చూస్తూ ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు.

3 / 5
విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో విశాలమైన అద్దాలు ఉంటాయి. ఈ బోగీలోని సీట్లు కూడా బయట దృశ్యాలను చూసేందుకు వీలుగా రూపొందించారు. సాధారణ కోచ్‌లతో పోలిస్తే ఈ విస్డాడోమ్ కోచ్‌లో ప్రకృతి అందాలను వీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ క్రమంలో విస్టాడోమ్ కోచ్ తీసుకొచ్చారు.

4 / 5
అద్దాల రైలు నుంచి అరకు అందాలను వీక్షించాలనుకునేవారు టికెట్ల లభ్యతను బట్టి బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.  టికెట్ల వివరాలు, ప్రయాణ సమయాలను ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో చూడవచ్చని స్పష్టం చేశారు. పండుగ సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న క్రమంలో ముందే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 5
Follow Us