హైదరాబాద్‌లో మొదలైన మెట్రో ట్రయల్ రన్‌

అన్‌లాక్‌డౌన్‌లో భాగంగా ఈ నెల 7నుంచి నగరంలో మెట్రోను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్న విసయం తెలిసిందే.

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో ట్రయల్ రన్‌
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2020 | 1:37 PM

Hyderabad Metro Rail: అన్‌లాక్‌డౌన్‌లో భాగంగా ఈ నెల 7నుంచి నగరంలో మెట్రోను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్న విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రయల్ రన్‌ని ప్రారంభించారు. మెట్రో ఎండీ ఆధ్వర్యంలో టీమ్‌ స్టేషన్లను పరిశీలిస్తోంది. అలాగే కరోనా నిబంధనల విషయంలో ఏర్పాట్లను మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రయిల్ రన్‌లో భాగంగా ఇవాళ అమీర్‌పేట్‌ నుంచి మియపూర్ వరకు మెట్రో ప్రయాణించనుంది. దశల వారీగా మెట్రోను ప్రారంభించాలనుకుంటున్న అధికారులు.. భౌతిక దూరం పైననే ఎక్కువ దృష్టి పెట్టనున్నారు.  ప్రయాణికుల రద్దీని బట్టి ట్రిప్పుల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా 7న  మియపూర్ నుంచి ఎల్బీనగర్.. 8వ తేదీన నాగోల్‌ నుంచి రాయదుర్గం.. 9న అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు తిరగనున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. ఇక ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read More:

గర్భిణీ భార్య పరీక్ష కోసం.. 1200కి.మీలు స్కూటర్‌పై

నటి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు