Hyderabad Metro: కరోనా వేళలో హైద్రాబాద్ మెట్రో కీలక నిర్ణయం..మెట్రో రైలు సమయాల్లో మార్పులు!

కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అన్ని ప్రజా వ్యవస్థలూ రాత్రి 8 గంటల కల్లా మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Hyderabad Metro: కరోనా వేళలో హైద్రాబాద్ మెట్రో కీలక నిర్ణయం..మెట్రో రైలు సమయాల్లో మార్పులు!
Hyderabad Metro
Follow us

|

Updated on: Apr 20, 2021 | 3:47 PM

Hyderabad Metro:  కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అన్ని ప్రజా వ్యవస్థలూ రాత్రి 8 గంటల కల్లా మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ హైదరబాద్ మెట్రో పై కూడా పడింది. ఈ నెల 30వ తేదీవరకూ మెట్రో సమయాలను కుదిస్తున్నట్టు హైదరబాద్ మెట్రో ట్విట్టర్ ద్వారా తెలిపింది. నైట్ కర్ఫ్యూ నేపధ్యంలో ఈ  నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.  దీనిప్రకారం మెట్రో చివరి రైలు రాత్రి 7:45 గంటలకు ఉంటుంది. ఇంతకు ముందు ఇది రాత్రి 9:30 గంటల వరకూ ఉండేది. అన్ని టెర్మినల్ స్టేషన్లలోనూ చివరి మెట్రో రాత్రి 7:45 గంటలకు బయలు దేరుతుంది. కాగా ఉదయం రైళ్ళ ప్రారంభ సమయాల్లో ఏమీ మార్పులు చేయలేదు మెట్రో.

మొదటిసారి కరోనా వచ్చినపుడు లాక్ డౌన్ లో మెట్రో చాలా నెలల పాటు మూసివేశారు. అన్ లాక్ ప్రక్రియ ప్రంభం అయ్యాకా.. మెట్రో రైళ్ళను దశల వారీగా ప్రారంభించారు. మొదట ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమె మెట్రో ప్రారంభించారు. తరువాత ఆ సమయాన్ని పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం మెట్రో రైళ్ళు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకూ నడుస్తున్నాయి. ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ ప్రభావంతో ఆ సమయాన్ని ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 7:45 గంటలకు కుదించారు.ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని మెట్రో రైలు తన ట్వీట్ లో కోరింది.

మెట్రో సర్వీసుల సమయాన్ని కుదిస్తూ హైదరాబాద్ మెట్రో ట్వీట్..

Also Read: Kedareshwar Temple : ఈ గుడిలో అన్ని అద్భుతాలే.. నాలుగో స్థంభం విరిగిన రోజున కలియుగం చివరి రోజట

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్.. ట్విట్ చేసిన కాంగ్రెస్ నేత.. ఏమన్నారంటే..?