Hyderabad: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. కేంద్రం నుంచి భారీ శుభవార్త.. ఇక రయ్.. రయ్..

హైదరాబాద్ మెట్రో రెండో దశకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. దీంతో మెట్రోపై మరో ముందడుగు పడినట్లయింది. కేంద్రం ఇప్పటికే మెట్రో సేకండ్ ఫేజ్‌కు ఆమోదం ఇవ్వగా.. ఇప్పుడు నిధులు కూడా విడుదల చేసింది.

Hyderabad: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. కేంద్రం నుంచి భారీ శుభవార్త.. ఇక రయ్.. రయ్..
Hyderabad Metro

Updated on: Nov 03, 2026 | 7:53 AM

హైదరాబాద్ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చేసింది. మెట్రో సెకండ్ ఫేజ్ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మెట్రోను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా.. ఈ క్రమంలో రెండో విడత ప్రాజెక్టును షురూ చేసింది. ఇప్పటికే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అందించగా.. డీపీఆర్, రూట్ మ్యాప్ కూడా ఖారారు అయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం రూ.275 కోట్లు మంజూరు చేసింది. రూ.150 కోట్లు విస్తరణ పనుల కోసం అందించగా.. రూ.125 కోట్ల రుణాల చెల్లింపు కోసం కేటాయించింది.

హైదరాబాద్ మెట్రో రెండో దశపై అప్డేట్..

కేంద్రం నిధులు మంజూరు చేయడంతో హైదరాబాద్ మెట్రో రెండో దశపై మరో ముందడుగు పడినట్లయింది. పనులు త్వరగా ప్రారంభం కావడానికి ఇది ఊతమివ్వనుంది. ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు రావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. రెండో విడతలో భాగంగా 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర విస్తరించనుండగా.. రూ.38,595 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సమర్పించింది. ఈ ఏడాది మేలో డీపీఆర్ సమర్పించగా.. కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే సెకండ్ ఫేజ్‌కు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తూన్నారు. పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసిన రేవంత్.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ క్రమంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాంతాలకు మెట్రో సేవలు..

రెండో దశలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, కోకాపేట నియోపోలిస్, చంద్రాయణగుట్ట ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఇక మియాపూర్ టూ పటాన్‌చెరు, ఎల్బీనగర్ టు హయత్ నగర్, మేడ్చల్ టూ శామీర్ పేట్ వంటి మార్గాలు ఉన్నాయి. ఈ రూట్లు పూర్తయితే హైదరాబాద్‌లో ప్రయాణ కష్టాలు కాస్త తొలగిపోయే అవకాశముంది. నగర ప్రజలకు ట్రాఫిక్ రద్దీ లేని మెరుగైన ప్రయాన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. అయితే మెట్రో విస్తరణ కోసం భారీగా నిధులు అవసరం కానున్నాయి. దీంతో పాటు అనుమతులు, నిర్మాణ ఒప్పందాలు పూర్తి కావల్సి ఉంటుంది. కాగా అప్పుల భారంతో మెట్రోను నిర్వహించలేక ఎల్‌అండ్‌టీ సంస్ధ బాధ్యతల నుంచి తప్పుకుంది.  దీంతో మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియగా కూడా పూర్తి అవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us