ఖైరతాబాద్ గణేష్ ఎఫెక్ట్.. రికార్డులు బ్రేక్ చేసిన మెట్రో..

హైదరాబాద్‌ మెట్రో మరో రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం రోజు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే మెయిన్ స్టేషన్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్, ఉప్పల్, మాదాపూర్ వంటి స్టేషన్లలోనే రద్దీ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అమీర్‌పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో ఒక్కరోజు 40 వేల మంది ప్రయాణికులు ఎక్కిన రికార్డు మాత్రమే ఉంది. అయితే తాజాగా ఆదివారం ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో […]

ఖైరతాబాద్ గణేష్ ఎఫెక్ట్.. రికార్డులు బ్రేక్ చేసిన మెట్రో..
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 12:21 PM

హైదరాబాద్‌ మెట్రో మరో రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం రోజు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే మెయిన్ స్టేషన్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్, ఉప్పల్, మాదాపూర్ వంటి స్టేషన్లలోనే రద్దీ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అమీర్‌పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో ఒక్కరోజు 40 వేల మంది ప్రయాణికులు ఎక్కిన రికార్డు మాత్రమే ఉంది. అయితే తాజాగా ఆదివారం ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఆదివారం మొత్తం 70 వేల మందికి పైగా మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ స్టేషన్‌లో 40 వేల మంది దిగగా.. ఇక్కడి నుంచి 30 వేల మంది ఎక్కినట్లు వివరించారు. మెట్రో ప్రారంభం నుంచి చూస్తే.. ఒక స్టేషన్‌ నుంచి ఒక రోజులో ఇంతమంది ప్రయాణించడం ఇదే మొదటిసారి.

ఆదివారం కావడం.. ఖైరతాబాద్ భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అయితే గణనాథుడిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మెట్రో రైల్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మెట్రో రికార్డులు బ్రేక్ అయ్యాయి. కాగా, భక్తుల రద్దీని ఉద్ద్యేశించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి నాలుగున్నర నిమిషానికి ఒక మెట్రో ఉండేలా చర్యలు చేపట్టారు. రాత్రివేళ అర్ధగంట పాటు వేళల్ని పొడిగించారు. ఖైరతాబాద్‌ నుంచి అన్ని వైపులకు చివరి మెట్రో 11.30 గంటల వరకు నడిపినట్లు మెట్రో రైలు ఎండీ తెలిపారు.

Latest Articles
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ