అమెరికాలో ట్రయల్స్.. ఇక్కడేమో అమ్మకాలు.. హైదరాబాద్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల కలకలం!

హైదరాబాద్‌లో అక్రమ వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల విక్రయాల గుట్టు రట్టయింది. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఇంజెక్షన్లను వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా భారత్‌లో విక్రయిస్తున్న ముఠాను టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.5 వేల వరకు అమ్ముతున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో కాన్పూర్‌కు చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలో ట్రయల్స్.. ఇక్కడేమో అమ్మకాలు.. హైదరాబాద్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల కలకలం!
Hyderabad Weight Loss Injection Racket Busted

Updated on: Nov 24, 2026 | 12:19 PM

హైదరాబాద్: బరువు తగ్గేందుకు వాడే ప్రమాదకరమైన వెయిట్‌లాస్ ఇంజెక్షన్లను ఆన్‌లైన్ వేదికగా అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TG SAFE) అధికారులు రట్టు చేశారు. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్న ఈ ఇంజెక్షన్లను భారత్‌లో నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వ్యక్తిపై హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, ఈ అక్రమ ఇంజెక్షన్ల దందా వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా సాగుతున్నట్లు టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ఈ ఇంజెక్షన్ వయల్స్‌పై కేవలం పరిశోధనల కోసం మాత్రమే అని స్పష్టంగా ముద్రించి ఉన్నప్పటికీ, నిందితులు వాటిని సామాన్యులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒక్కో ఇంజెక్షన్ ధర సుమారు రూ. 5,000 వరకు చూపిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు తేలింది. ఇంజెక్షన్లతో పాటు 12 పేజీల వివరాలను కూడా పంపినట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్ పెప్టైడ్ పేరుతో ఈ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

కాన్పూర్ నుంచి సరఫరా.. కొనుగోలుదారులపైనా నిఘా..

దర్యాప్తులో భాగంగా కాన్పూర్‌లోని మురళీధామ్ ప్రాంతం నుంచి ఈ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే సంతోష్‌రెడ్డి అనే వ్యక్తికి రూ. 6,000 విలువైన ఇంజెక్షన్లు, మరో వ్యక్తికి రూ. 23,000 విలువైన ఇంజెక్షన్లను నిందితులు డెలివరీ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో అమ్మకందారులతో పాటు అనుమతి లేని ఇంజెక్షన్లను కొనుగోలు చేసిన వారిపైనా అధికారులు నిఘా ఉంచి లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఈ అక్రమ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఇంజెక్షన్లు చాలా డేంజర్.. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి డ్రగ్స్ తీసుకోకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us