Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం హైజాక్‌ బెదిరింపు..! ఫేక్‌ మెయిల్‌గా గుర్తించిన అధికారులు..

|

Oct 09, 2023 | 9:35 AM

Shamshabad Airport: విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు ఆ మెయిల్‌లో ఉంది. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఆ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 09: శంషాబాద్ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు ఆ మెయిల్‌లో ఉంది. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఆ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు.

మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మెయిల్ వచ్చి ఐపీ అడ్రస్ పై టెక్నికల్ టీం ఆరా తీస్తోంది. మరో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Published on: Oct 09, 2023 09:34 AM