బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్ సిటీ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో కేసినో, పేకాట నిర్వహించారు. అయితే ఆ ఫామ్‌హౌస్‌ను హీరో నౌగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ 5 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత గుత్తా సుమన్‌కు ఆ ఫామ్‌హౌస్ రెంట్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలని శంకర్ ప్రసాద్‌ను పోలీసులు కోరుతూ నోటీసులు ఇష్యూ చేయగా, ఆయన స్పందించలేదు. రెంటల్ అగ్రిమెంట్ నిబంధనలు పాటించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా శంకర్ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.
పేకాట నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై తెలంగాణలో పీడీయాక్ట్ నమోదు చెయ్యబోతున్నారు. హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఈ యాక్ట్ భుజాన వేసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. ఇంకెవరో కాదు.. గుత్తా సుమన్ కుమార్. గుత్తా సుమన్ మీకు గుర్తుండే ఉంటుంది.. సిటీ శివారులోని నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఓ రేంజ్లో పేకాట నిర్వహించిన ఘనుడు. ఆ రోజు మొత్తం 30మంది వరకూ పట్టుబడ్డారు. శ్రీరామ్ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. నిజామాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ ఉన్నారు. ఆ రోజు టీవీ9-పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో వాళ్ల బండారం అంతా బయటపడింది. క్యాసినో చిప్స్, నోట్ల కట్టలు, స్వైపింగ్ మిషీన్స్, కావల్సినంత మందు, వెరైటీ ఫుడ్.. అబ్బో ఒక్కటేంటి వీకెండ్ మజా అంతా అక్కడే దర్శనమిచ్చింది. అయితే ఈ కేసు అనూహ్యంగా హీరో నాగశౌర్య తండ్రికి చుట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్