GHMC Sanitary Staff: జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త.. ఐసొలేషన్‌‌లో ఉన్నవారికి పూర్తి వేతనాలు..!

కోవిడ్ నియంత్రణకు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ అధిక ప్రాధాన్యమిస్తోంది.

GHMC Sanitary Staff: జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త.. ఐసొలేషన్‌‌లో ఉన్నవారికి పూర్తి వేతనాలు..!
Ghmc Sanitary Staff

Updated on: May 24, 2021 | 9:56 AM

GHMC Sanitary Staff Wages: కరోనా విజృంభిస్తున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉంటూ విశేష సేవలందిస్తున్న పారిశద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తోంది. కోవిడ్ నియంత్రణకు అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ అధిక ప్రాధాన్యమిస్తోంది. స్వీపింగ్‌ విధులు నిర్వహించే కార్మికులు, ఎంటమాలజీ వర్కర్లలో ఎవరైనా కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే వారిని ఐసొలేషన్‌కు అనుమతిస్తూ మందులను కూడా ఉచితంగా అందిస్తోంది. దీంతోపాటు పూర్తి వేతనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం తొలివిడత కరోనా నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

ఆర్టీపీసీఆర్‌ గాని ఇతర పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చి, ఆ పాజిటివ్‌ మెసేజ్‌ మొబైల్‌లో వచ్చిన కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలను కూడా అందజేస్తోంది. తమకు పాజిటివ్‌ వచ్చిందని తమ సెల్‌ఫోన్‌ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్‌లోని అధికారులకు చూపిస్తే వారికి ఆయా ఐసొలేషన్‌ రోజుల వేతనాలను కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి అధికారిక పోర్టల్‌లో ఉంచిన వివరాలను సమర్పించాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది కార్మికులు వీక్లీ హాఫ్‌, వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యంతో గైర్హాజరవుతున్నారు. కోవిడ్‌తో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో విధులకు రావడంలేదని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. వీరిలో పాజిటివ్‌ వచ్చిందని తమ సెల్‌ఫోన్‌ ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్‌లోని అధికారులకు చూపిస్తే వారికి ఆయా ఐసొలేషన్‌ రోజుల వేతనాలను ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Read Also… Minister S Jaishankar: అమెరికా చేరుకున్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. ‘మిషన్ వ్యాక్సిన్’పైనే ప్రధాన చర్చ..!

Loading...
Unable to load recommendations.
Follow Us