హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

|

Feb 25, 2021 | 6:03 AM

ఓ వీడియో భాగ్యనగరాన్ని హడలెత్తించింది. కొద్ది నిమిషాల్లోనే.. హైదరాబాద్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. బాలానగర్‌లోని ఓ ప్లై ఓవర్‌.. కుప్పకూలిందంటూ...

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Follow us on

ఓ వీడియో భాగ్యనగరాన్ని హడలెత్తించింది. కొద్ది నిమిషాల్లోనే.. హైదరాబాద్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. బాలానగర్‌లోని ఓ ప్లై ఓవర్‌.. కుప్పకూలిందంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఉన్నపలంగా అండర్‌ కంట్రక్షన్‌లో ఉన్న ఫ్లైఓవర్‌ పిల్లర్‌.. కుప్పకూలిందని.. ఆ పిల్లర్‌ కింద పార్క్‌ చేసిన కార్లు మొత్తం ధ్వంసం అయిన్నట్లు వీడియోలో ఉంది. ఇక ఈ వ్యవహారంపై తాజాగా హెచ్‌ఎండీఏ అధికారులు స్పందిస్తూ.. ఈ వార్తలో నిజం లేదని.. ఈ ఘటన గురుగ్రామ్‌లో గత ఏడాది జరిగినదిగా తెలిపారు.

ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని శిథిలాల కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకున్నాయని.. అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నట్లు ఓ వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది వాట్సప్‌లో షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు బాలానగర్, జీడిమెట్ల వైపు వెళ్లకూడదని కొందరు సూచిస్తున్నారు. దీంతో ఈ వీడియోపై అధికారులు స్పందించి, ఇది ఓ ఫేక్‌ వీడియో అని తెలిపారు.

కాగా, ఈ వీడియోలో ఉన్న ఘటన.. గత ఏడాది గురుగ్రామ్‌లో జరిగింది. అక్కడ స్థానిక సోహ్నా రోడ్డులో నిర్మాణంలోని ఓ ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. ఆ సమయంలో.. రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ప్లైఓవర్‌ కింద నలిగిపోయాయి. ఈ ఘటనలో చాలా మందే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వీడియోను ఇప్పుడు.. వైరల్‌ అవుతుంది. దీంతో ఈ ఘటనను గుర్తు చేస్తూ.. హెచ్‌ఎండీఏ అధికారులు తప్పుడు వీడియో గుర్తించి కొట్టిపారేశారు. ఇక ఈ పాత వీడియోను వైరల్ చేసిన వ్యక్తిని బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సనత్ నగర్‌లోని ఓ ట్రావెల్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌గా నిందితుడిని గుర్తించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!