Tv9 Telugu Number 1 website: తగ్గేదే లే.. డిజిటల్ మీడియా రంగంలోనూ టీవీ9 తెలుగు సెన్సేషన్.. నంబర్ 1 స్థానంలో వెబ్‌సైట్

| Edited By: Narender Vaitla

Jul 01, 2021 | 6:47 PM

టీవీ9 తెలుగు మరో మైలురాయిని అధిగమించింది. న్యూస్ ఛానల్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. తాజాగా డిజిటల్ మీడియాలో...

Tv9 Telugu Number 1 website: తగ్గేదే లే.. డిజిటల్ మీడియా రంగంలోనూ టీవీ9 తెలుగు సెన్సేషన్.. నంబర్ 1 స్థానంలో వెబ్‌సైట్
Tv9 Telugu Number 1 Website
Follow us on

టీవీ9 తెలుగు మరో మైలురాయిని అధిగమించింది. న్యూస్ ఛానల్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. తాజాగా డిజిటల్ మీడియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అనతి కాలంలోకే అంచలంచలుగా ఎదిగి టీవీ9 తెలుగు వెబ్‌సైట్ తెలుగు డిజిటల్ మార్కెట్‌లో నంబర్ 1 ( న్యూస్ వెబ్‌సైట్ల పరంగా అత్యన్నత ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ  Comscore Rankings లో) స్థానంలో నిలిచింది. మెరుగైన సమాజం కోసం నిత్యం తపిస్తున్న టీవీ9 తెలుగు ఛానల్ వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహారణ. వార్తలో వాయు వేగం.. అంతకుమించిన ఖచ్చితత్వం.. సమాజం సమస్యలను ఎటువంటి బెరుకు లేకండా ప్రజెంట్ చేయడం వంటివి టీవీ9 తెలుగును అగ్రస్థానంలో నిలబెట్టాయి. నంబర్ 1 గా ఉండటం టీవీ9 తెలుగు బర్త్ రైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది పనీపాట లేని వాళ్లు మూకలుగా ఏర్పడి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం మళ్లీ టీవీ9కే పట్టం కట్టారు. కాగా టీవీ9 తెలుగు నంబర్ 1గా నిలవడంతో.. నేడు సంస్థ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను నంబర్ 1గా నిలపడంలో భాగమైన ప్రతి వ్యక్తిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాక్షించారు. మెరుగైన సమాజం అనే స్లోగన్ మనసులో పెట్టుకుని అలానే ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. పాత్రికేయ విలువలకు కట్టుబడుతూ డిజిటల్ లోనూ టీవీ9 తెలుగు దూసుకుపోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

(మే నెలకు సంబంధించి 16.54 మిలియన్ల మంది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను సందర్శించారు. ఇది మునుపటి నెలతో పోల్చితో 38 శాతం అధికం.)