AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో దారుణం.. సోదరుడి వైద్యం కోసం హాస్పిటల్‌కి వచ్చిన యువతి‌పై అత్యాచారం..

Hyderabad: కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఈ నెల 6న తన సోదరుడిని ఈఎస్ఐ హాస్పిటల్లో చేర్పించింది. అప్పటి నుండి యువతి తన సోదరుని కోసం హాస్పిటల్‌ వద్దే ఉంటుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి వేళ భోజనం తీసుకు వచ్చేందుకు క్యాంటీన్ వద్దకు వెళ్లిన యువతి తిరిగి వస్తుండగా.. లిఫ్ట్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెన తన  సోదరుడి యోగక్షేమాలు..

హైదరాబాద్‌లో దారుణం.. సోదరుడి వైద్యం కోసం హాస్పిటల్‌కి వచ్చిన యువతి‌పై అత్యాచారం..
Representative Image
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Sep 17, 2023 | 10:29 AM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 17: సోదరుడి వైద్యం కోసం వచ్చిన యువతిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. లిఫ్ట్ లో వెళ్తున్న యువతని బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశాడు.. సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ క్యాంటీన్ లో పని చేసే షాదాబ్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వందల మంది వైద్య సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్న హాస్పిటల్ లోనే ఇలాంటి దారుణం జరగడంపై పేషంట్ అటెండర్స్ ఆందోళనకు గురి అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌ పరిథిలోని ఈఎస్ఐ హాస్పిటల్ క్యాంటీన్లో పని చేసే షాబాద్ అనే యువకుడు యువతీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఈ నెల 6న తన సోదరుడిని ఈఎస్ఐ హాస్పిటల్లో చేర్పించింది. అప్పటి నుండి యువతి తన సోదరుని కోసం హాస్పిటల్‌ వద్దే ఉంటుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి వేళ భోజనం తీసుకు వచ్చేందుకు క్యాంటీన్ వద్దకు వెళ్లిన యువతి తిరిగి వస్తుండగా.. లిఫ్ట్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెన తన  సోదరుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే క్యాంటీన్లో పని చేస్తున్న షాదాబ్ అనే యువకుడిని ఆ యువతికి పరిచయం చేశాడు.

అలా పరిచయమైన షాదాబ్ అప్పుడే ఆ యువతికి ఒక కోడి గుడ్డు ఇచ్చి తినమన్నాడు. అది తినేసి లిఫ్ట్లో సోదరుడి వద్దకు వెళ్ళిపోతున్న సమయంలో అమెతో పాటే వచ్చిన షాదాబ్ బలవంతంగా తనను రెండో ఫ్లోర్లో ఉన్న చీకటి ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళాడు. అనంతరం ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి విషయం తెలియజేసింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు షాదాబ్‌పై కేసు నమోదు చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి