బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. మైండ్ సెట్ మార్చేవిధంగా మరమ్మత్తులు!

హైదరాబాద్‌ బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. నవంబర్ 23వ తేదీ రోజు జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లై ఓవర్‌ను అప్పట్లో అధికారులు మూసివేశారు. దీంతో ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో.. నిపుణుల బృందం పరిశీలించి.. కొన్ని సూచలను చేసింది. కేవలం స్వల్ప మరమ్మత్తులతోనే నిపుణుల బృందం క్లీన్‌చీట్‌ ఇవ్వడంతో ఫ్లైఓవర్‌ను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు జీహెచ్‌ఎంసీ అధికారులు. శనివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, […]

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. మైండ్ సెట్ మార్చేవిధంగా మరమ్మత్తులు!
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 11:50 AM

హైదరాబాద్‌ బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. నవంబర్ 23వ తేదీ రోజు జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లై ఓవర్‌ను అప్పట్లో అధికారులు మూసివేశారు. దీంతో ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో.. నిపుణుల బృందం పరిశీలించి.. కొన్ని సూచలను చేసింది. కేవలం స్వల్ప మరమ్మత్తులతోనే నిపుణుల బృందం క్లీన్‌చీట్‌ ఇవ్వడంతో ఫ్లైఓవర్‌ను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

శనివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఫ్లై ఓవర్లపై అవగాహనతో వాహనం నడపాలన్నారు. ఫ్లైఓవర్ పైకి వెళ్లేముందే.. వాహనదారుని మైండ్ సెట్ మార్చే విధంగా స్పీడ్ లిమిడ్ బోర్డులను, స్పీడ్‌ బ్రేకర్స్‌‌‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఫ్లైఓవర్‌పై 40 స్పీడ్‌ దాటితే 1,100 రూపాయల ఫైన్‌ విధిస్తామన్నారు. మరమ్మత్తులో భాగంగా ఫ్లై ఓవర్‌పై స్పీడ్‌ గన్స్‌, స్పీడ్‌ సెన్సార్‌ ఏర్పాటు చేశామన్నారు. అలాగే.. ఫ్లైఓవర్‌పై సెల్ఫీలను తీసుకోకూడదని సూచించారు. కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగిందని వారు పేర్కొన్నారు.

Latest Articles