మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ఇంట్లో 25 ఏళ్ల యువకుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!
Vanasthalipuram Tragedy

Updated on: Nov 11, 2026 | 11:56 AM

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ఇంట్లో 25 ఏళ్ల యువకుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేతాల శివకుమార్ (25) హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వనస్థలిపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమ వ్యవహారానికి దారితీసినట్లు సమాచారం.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం (నవంబర్ 08) రాత్రి మద్యం సేవించిన శివకుమార్ యువతి ఇంటికి వెళ్లాడు. తన ప్రేమను అంగీకరించాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే యువతి అతడి ప్రేమను నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొద్దిసేపటి తర్వాత యువతి ఇంట్లోనే శివకుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

యువకుడి మృతికి గల అసలు కారణం ఏమిటి? ఎలా మరణించాడు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us