Wife Cheating: ప్రియుడితో బెడ్‌రూమ్‌లో భార్య.. అది చూసిన భర్త బయటి నుంచి గడియ పెట్టాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

Wife Cheating: తనను మోసం చేస్తూ ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. తన భార్య, ఆమె ప్రియుడు...

Wife Cheating: ప్రియుడితో బెడ్‌రూమ్‌లో భార్య.. అది చూసిన భర్త బయటి నుంచి గడియ పెట్టాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..
Cheating

Updated on: Jun 13, 2021 | 8:40 AM

Wife Cheating: తనను మోసం చేస్తూ ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. తన భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో ఉండటాన్ని గమనించిన భర్త.. వారిద్దరినీ గదిలో బంధించి తాళం వేశాడు. అనంతరం పోలీసులను పిలిపించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బైంసాలోని ఏపీ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజు, తన భార్యతో కలిసి భైంసాలోని ఏపీ నగర్‌లో నివాసముంటున్నాడు. అయితే, నాగరాజు భార్య రూపేష్ అనే మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. తొలుత నాగరాజు దంపతుల కాపురం సాఫీగానే సాగినా.. ఆ తరువాత భార్య అసలు నిజస్వరూపం బయటపడింది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న నాగరాజు.. తన భార్యను పలుమార్లు హెచ్చరించాడు.

ఈ వార్నింగ్‌లను పట్టించుకోకపోగా.. మరింత రెచ్చిపోయింది. అతని మాటలను బేఖాతరు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నాగరాజు భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి బెడ్‌రూమ్‌లో ఉండగా.. నాగరాజు గమనించాడు. వెంటనే వారు ఉన్న గది బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజు ఇంటికి వచ్చి అతని భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నించగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో భయపడిన వీరు.. గది లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా తలుపులు తీయలేదు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులకు వారు చుక్కలు చూపించారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read:

COVID-19 Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి.. 25 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య

Loading...
Unable to load recommendations.
Follow Us