లేడీ గంతులతో వేగలేకపోతున్నాం..మా గోడు వినండి !

కృష్ణ జింకలను చూస్తుంటే సహజంగా ఆహ్లాదకరంగా, ఆనందంగా  అనిపిస్తుంది..చెంగు చెంగున గెంతుతూ పరుగెడుతుంటే పిల్లలు, పెద్దలు సైతం ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ ఇక్కడ అందుకు విరుద్దంగా ఉంది.. జింకలను చూస్తే చాలు రైతులు వామ్మో అంటూ ఆందోళన చెందుతున్నారు.. నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్‌, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో వేలాదిగా ఉన్న కృష్ణ జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు […]

లేడీ గంతులతో వేగలేకపోతున్నాం..మా గోడు వినండి !
Follow us

|

Updated on: Dec 28, 2019 | 1:23 PM

కృష్ణ జింకలను చూస్తుంటే సహజంగా ఆహ్లాదకరంగా, ఆనందంగా  అనిపిస్తుంది..చెంగు చెంగున గెంతుతూ పరుగెడుతుంటే పిల్లలు, పెద్దలు సైతం ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ ఇక్కడ అందుకు విరుద్దంగా ఉంది.. జింకలను చూస్తే చాలు రైతులు వామ్మో అంటూ ఆందోళన చెందుతున్నారు.. నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్‌, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో వేలాదిగా ఉన్న కృష్ణ జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరాయి. అచ్చంపేట, పెగడబండ, అడవిసత్యవార్‌ శివారుల్లో గొర్రెల మందలను తలపిస్తున్నాయి.. పొలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పత్తి, కంది, వరి ఇలా ఏ పంటనూ వదలడం లేదు. ఒక్కసారి మంద వచ్చి పంటపై పడితే క్షణాల్లో ఎకరం పంట తినేస్తున్నాయి. ఒకటి రెండూ కాదు. ఒక్క గుంపులో 200 నుంచి 300 వరకు జింకలు ఉంటున్నాయి. జింకల భయానికి రాత్రింబవళ్లు కంటికి రెప్పలా పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది సాగు చేసిన పంటల్లో సగం వరకు జింకలకే ఆహారంగా మారింది. దీంతో పంటలు సాగు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.

కర్ణాటక సరిహద్దులోని తంగడి నుంచి మొదలుకుంటే.. నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా తీరప్రాంతంలో కృష్ణ జింకలు వేల సంఖ్యలో ఉన్నాయి. జింకలకు ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంది. విషాలమైన మైదానంతో పాటు చిన్న చిన్న గుట్టలు, నదీ తీరం కావడం వల్ల తాగునీటి వసతి కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని జింకలు సేఫ్ జోన్ గా ఎంచుకున్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో వృద్ధి చెందుతున్నాయి. జింకల వల్ల పంటలు సాగుచేసుకోలేక పోతున్నామని, చిన్న మొక్కగా ఉన్నప్పుడే తినేస్తున్నాయి. కాస్త పెద్ద మొక్కగా మారే వరకూ కాపాడుకున్నా పత్తి కాయలనూ వదలడం లేదు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో..రాదో అని భయపడే రైతన్నకు జింకలు ఆ పంటలు చేతికందకుండాచేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నష్టాన్ని చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జింకల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించి లేదా పార్కుకు తరలించి ఒక చోట ఉంచి ఆహారం లభించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!