
MMTS Trains: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక MMTS సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 25, 26,27 రాత్రులలో (రాత్రి 23:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల మధ్య) ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
| క్రమ సంఖ్య | రైలు నంబరు | మార్గం (ఎక్కడి నుండి – ఎక్కడి వరకు) | బయలుదేరు సమయం | చేరుకునే సమయం |
| 1 | GSH-1 | సికింద్రాబాద్ – హైదరాబాద్ | 23.50 | 00.20 |
| 2 | GHL-2 | హైదరాబాద్ – లింగంపల్లి | 00.30 | 01.20 |
| 3 | GLH-3 | లింగంపల్లి – హైదరాబాద్ | 01.50 | 02.40 |
| 4 | GHS-4 | హైదరాబాద్ – సికింద్రాబాద్ | 03.30 | 04.00 |
| 5 | GHL-5 | హైదరాబాద్ – లింగంపల్లి | 23.10 | 23.55 |
| 6 | GLF-6 | లింగంపల్లి – ఫలక్‌నుమా | 00.10 | 01.50 |
| 7 | GFS-7 | ఫలక్‌నుమా – సికింద్రాబాద్ | 02.20 | 03.00 |
| 8 | GSH-8 | సికింద్రాబాద్ – హైదరాబాద్ | 04.00 | 04.40 |
గమనిక: పైన పేర్కొన్న ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు ఆ మార్గంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ ఆగుతాయి.
నిమజ్జనం రోజు రాత్రి పూట కూడా ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నిరంతరాయంగా నడుస్తాయి. శోభాయాత్రను చూసేందుకు, నిమజ్జనంలో పాల్గొని తిరిగి వెళ్లే భక్తులకు రాత్రివేళల్లో రవాణా సౌకర్యం ఉంటుంది. అందుకే ప్రయాణికులను, భక్తులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
Railways
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి