Good News: హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా ఉచితమే..

Telangana Free Water: సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ వాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కంటోన్మెంట్ ఏరియాలోనూ..

Good News: హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా ఉచితమే..
Ghmc

Updated on: Mar 02, 2022 | 7:01 PM

Telangana Free Water: సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ వాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కంటోన్మెంట్ ఏరియాలోనూ ఉచిత మంచినీటి పథకం అమలు కానుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతునన పథకాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గానికి విస్తరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. కంటోన్మెంట్ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డుతో హైదరాబాద్ వాటర్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఇస్తున్నట్లుగా.. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివసిస్తున్న ప్రజలకు కూడా ఉచిత మంచినీటి పథకాన్ని అమలు చేయాలని కంటోనమెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇద్దరూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు హైదరాబాద్‌ వాటర్‌ బోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ వాసులకు కూడా నెలకు 20 వేల లీటర్ల వరకు పేద వారికి ఉచిత మంచినీటిని అందించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ బోర్డులతో హైదారాబాద్ వాటర్ బోర్డు ఒప్పందం చేసుకుంది.

Also read:

Viral Video: మాంచి ప్లేస్‌ చూసుకుని మరీ రెచ్చిపోయాయి.. కుక్కల గ్యాంగ్ వార్.. చూస్తే గుండెలదిరిపోతాయి..!

Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..