నాన్నంటే ముందుండి నడిపించే నమ్మకం. కూతుళ్లకు నాన్నే ఓ సూపర్ హీరో. ఇలాంటి గొప్ప అనుబంధానికి మాయని మచ్చ తెచ్చే సంఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో జరిగింది. మద్యం మత్తులో కన్న కూతుళ్లపైనే కన్నేసిన కసాయి తండ్రి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భార్య వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెను తీవ్రంగా కొట్టి తరిమేశాడు. తమతో ఎంతో ప్రేమగా ఉండే నాన్నలో (Father) ని రాక్షసత్వాన్ని చూసి ఆ చిన్నారులు వణికిపోయారు. అతని దాడి నుంచి ఎలాగోలా తప్పించుకుని చనిపోయేందుకు చెరువు వద్దకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి వనస్థలిపురంలోని (Vanasthalipuram) ఓ కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వచ్చి కూతుళ్లను లైంగికంగా వేధించేవాడు. అతడి చేష్టలను భార్య ఎప్పటికప్పుడు ప్రతిఘటించేది. ఓసారి కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడుతుండగా వద్దని భార్య వారించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భార్యను తీవ్రంగా కొట్టి ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు.
అనంతరం 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. తండ్రి ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన మిగతా కుమార్తెలు అరవడంతో అతడు భయపడిన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితులు షీ టీమ్‌కు ఫోన్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు రక్షించలేరని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వీరిని చూసిన ఓ మహిళ.. చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేశారు. తమ వివరాలను తెలిపారు. వారు పోలీసులకు వివరాలు అందించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై చెరువు వద్దకు చేరుకున్నారు. బాధితులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.
Also Read
Clouds: కొన్ని మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయి..? కారణాలు తెలుసుకోండి..!
Corona Waves: దేశంలో కరోనా కొత్త వేవ్ విజృంభణ.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే