రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఓ కుటుంబం మొత్తం.. వీడియో

ఖమ్మం జిల్లా వైరా మండలం గోల్లపూడి వద్ద రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో చెట్టుకు మంటలు అంటుకుని రహదారిపై కూలిపోయింది. అదే సమయంలో వెళ్తున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల కారుపై భారీ వృక్షం పడటంతో కారు ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఓ కుటుంబం మొత్తం.. వీడియో
Road Accident

Edited By:

Updated on: May 29, 2026 | 9:35 AM

వద్దని చెబుతున్నా.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రతి రోజూ ఎక్కడో ఓచోట.. రైతులు పొలాల్లో వ్యర్ధాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు దంపతులు.. చనిపోయారు.. ఈ క్రమంలోనే.. తాజాగా.. ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. పంట వ్యర్థాలను తగలబెట్టిన సంఘటనలో మరో భారీ ప్రమాదం తప్పింది. వైరా నుండి మధిర వెళ్ళే రహదారిలో ఇన్నోవా కారులో టిఎన్‌జివో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో వెళ్తుండగా.. అకస్మాత్తుగా భారీ చెట్టు రోడ్డుపై పడిపోయింది.. అది ఇన్నోవా కారుపై పడిపోవడంతో దానిలో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. అంతేకాకుండా కారు పూర్తిగా ధ్వంసమైంది.

కారులో ప్రయాణిస్తున్న ఏలూరి కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గోల్లపుడి గ్రామం వద్ద వైరా మధిర రహదారి పై ఓ రైతు.. పంట వ్యర్ధాలు తగలబెట్టగా చెట్టుకి నిప్పంటుకొని ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా పడిపోయింది. అదే సమయంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న తెలంగాణ గెజిటెడ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తో పాటు వారి కుటుంబ సభ్యులు రెండు కార్లలో వైరా నుండి మధిర వైపు వెళ్తుండగా .. ఓ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం పడిపోయింది.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు, డ్రైవర్ కు గాయాలయ్యాయి.

వీడియో చూడండి..

ఈ ప్రమాదంలో వాహనం ధ్వంసమైంది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కొందరు రైతులు పంట పొలాల్లో వ్యర్థాలు నిప్పు పెట్టడం వలన ప్రధాన రహదారి పక్కన వృక్షాలు కాలి రోడ్లపై పడుతున్నాయి.. అలాగే.. పలువురికి ప్రాణ సంకంటంగా మారుతోంది. ఇప్పటికైనా.. రైతులు పంటల వ్యర్థాలను కాల్చడం మానుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us