Drunk and Drive: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు.. నిన్న ఒక్క రోజే 931 వాహనాలు స్వాధీనం..

Drunk and Drive: హైదరాబాద్ నగర పోలీసులు అన్నంత పనీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు..

Drunk and Drive: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు.. నిన్న ఒక్క రోజే 931 వాహనాలు స్వాధీనం..

Updated on: Jan 01, 2021 | 1:34 PM

Drunk and Drive: హైదరాబాద్ నగర పోలీసులు అన్నంత పనీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయడమే కాకుండా.. తాగి బండ్లు నడుపుతూ దొరికిన వారికి అడ్డంగా బుక్ చేశారు. ఇయర్ ఎండింగ్ సందర్భంగా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య అధికమని భావించిన పోలీసులు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గురువారం నాడు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 931 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు, మందుబాబులకు సంబంధించిన 721 బైకులు, 190 కార్లు, 18 ఆటోలు, 2 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారందరికీ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా, బుధవారం నాడు నమోదైన కేసుల్లో అత్యధికంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 201 కేసులు నమోదు అయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో 171 కేసులు నమోదు అయ్యాయి. ఇక కూకట్‌పల్లి 167, మాదహపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 93 కేసులు నమోదు అయ్యాయి.

 

Also read:

కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. కీలక అనుమతులు మంజూరు చేసిన కేంద్రం పర్యావరణ శాఖ

‘FCUK’ టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్‏గా నవ్వించేందుకు సిద్ధమైన జగ్గుభాయ్..

Loading...
Unable to load recommendations.
Follow Us