‘FCUK’ టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్‏గా నవ్వించేందుకు సిద్ధమైన జగ్గుభాయ్..

సెకండ్ ఇన్నింగ్స్‏ మొదలు పెట్టి మంచి ఫాం మీద దూసుకుపోతున్నాడు ఒకప్పటి హీరో జగపతి బాబు. అటు పలు సినిమాల్లో నాన్న, విలన్ పాత్రల్లో నటించి

'FCUK' టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్‏గా నవ్వించేందుకు సిద్ధమైన జగ్గుభాయ్..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 12:30 PM

సెకండ్ ఇన్నింగ్స్‏ మొదలు పెట్టి మంచి ఫాం మీద దూసుకుపోతున్నాడు ఒకప్పటి హీరో జగపతి బాబు. అటు పలు సినిమాల్లో నాన్న, విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవల జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎఫ్‏సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి రాబోతున్నాడు. ఇప్పుటికే ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కోక్కటిగా రివీల్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ టీజర్‏ను దర్శకదీరుడు రాజమౌళి చేత విడుదల చేయించారు ఫిల్మ్ మేకర్స్.

తాజాగా విడుదలైన టీజర్‏ని బట్టి చూస్తే ఈ సినిమా నాలుగు పాత్ర చుట్టూ తిరిగే కథతో చక్కగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులో అమ్మాయిలని పడేసే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఇదే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామ్, బేబి సహశ్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.