డేంజర్ బెల్స్‌ మోగిస్తోన్న డెంగ్యూ

డేంజర్ బెల్స్‌ మోగిస్తోన్న డెంగ్యూ
Dengue Fever

విషజ్వరాలు, డెంగ్యూ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఒకేరోజు వేర్వేరు జిల్లాల్లో ఆరుగురు డెంగ్యూ, మరో ఇద్దరు విషజ్వరాలతో ప్రాణాలుకోల్పోయారు. యాదాద్రి జిల్లాలో జ్వరాలతో ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలో హనుమాన్ వాడ చెందిన శివ అనే యువకుడు డెంగ్యూ వచ్చి మృతి చెందాడు. గత మూడు రోజుల క్రితం వలిగొండ మండలంలోని  వెల్వర్తి గ్రామానికి చెందిన చర్చ్ పాదర్ స్వైన్ ఫ్లూ తో హైదరాబాద్ లో చికిత్స […]

Pardhasaradhi Peri

| Edited By: Ram Naramaneni

Sep 18, 2019 | 7:49 PM

విషజ్వరాలు, డెంగ్యూ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఒకేరోజు వేర్వేరు జిల్లాల్లో ఆరుగురు డెంగ్యూ, మరో ఇద్దరు విషజ్వరాలతో ప్రాణాలుకోల్పోయారు. యాదాద్రి జిల్లాలో జ్వరాలతో ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలో హనుమాన్ వాడ చెందిన శివ అనే యువకుడు డెంగ్యూ వచ్చి మృతి చెందాడు. గత మూడు రోజుల క్రితం వలిగొండ మండలంలోని  వెల్వర్తి గ్రామానికి చెందిన చర్చ్ పాదర్ స్వైన్ ఫ్లూ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట మంగలితండాలో డెంగ్యూతో అశ్వంత్ (8) అనే చిన్నారి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామ గుగులోతు లక్ష్మి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తోంది. జ్వరం రావడంతో కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి వెళ్లగా డెంగ్యూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ పట్టణంలో చెలువమద్ది రాజేందర్‌ (40) జ్వరం వచ్చిందని స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. కరీంనగర్‌ ఆస్పత్రిలో డెంగ్యూ నిర్ధారించగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యర్రబంజరలో వేల్పుల మరియమ్మ(52) జ్వరంతో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరింది. ఖమ్మంరాగా అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు తెలుపగా కొద్దిసేపటికే మరణించింది. నివేదిక పరిశీలించి డెంగ్యూగా నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం పంబాల కౌశిక్‌(19) జ్వరంతో ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. సిద్దిపేట ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. డెంగ్యూగా నిర్ధారించగా పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించాడు.  సంగారెడ్డి జిల్లా అల్లీపూర్‌ మండలం మహ్మద్‌అన్వర్‌, సత్య బేగం ఏకైక కుమార్‌ ఉమర్‌ (10) హైదరాబాద్‌ మదినగూడలోని అంకుర ఆస్పత్రిలో డెంగ్యూతో మృతిచెందాడు. అలాగే రంగారెడ్డినగర్‌ డివిజన్‌ నందానగర్‌లోని ఇక్బాల్‌ కుమారుడు బిలాల్‌ డెంగ్యూ కారణంగా నిలోఫర్‌ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మరణించాడు. భద్రాద్రి జిల్లాలో చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో విషజ్వరంతో గుర్రం సుమన్‌ (30) మృతి చెందాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu