Murasu Cyclone: తెలంగాణకు రెడ్ అలర్ట్.. మురసు తుఫాన్ వేళ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..

తెలంగాణపై మురసు తుఫాన్ ప్రభావం పడుతోంది. ఈ తుపాన్ ఏపీలో తీరం దాటడంతో తెలంగాణలో కూడా వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలను హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

Murasu Cyclone: తెలంగాణకు రెడ్ అలర్ట్.. మురసు తుఫాన్ వేళ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains

Updated on: Nov 03, 2026 | 8:23 AM

తీవ్ర తుపాను మురసు తీరం దాటింది. నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య మురసు తుపాను తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మురసు తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు నవంబర్ 3,4వ తేదీన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక నేడు, రేపు సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక రాబోయే రెండ్రోజుల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్,
హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గరిష్ఠ గా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిలాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక నవంబర్ 5న వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు ఛాన్సుంది. అటు నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం ఏపీలో నమోదైంది. ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ, బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీ, ప్రకాశం(జి) త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ, చిలకపాడులో 104.50 మిమీ, సంతనూతలపాడు 98.7మిమీ, పశ్చిమగోదావరి (జి) మొగల్తూరులో 96మిమీ, కోనసీమ(జి) మలికిపురం 93.7మిమీ వర్షపాతం నమోదు నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us