
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వేదిక అయిన టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు పోర్టల్‌కు సంబంధించిన డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్టు అధికారులు గుర్తించారు. సర్వర్‌ను పరిశీలించిన అధికారులకు అందులో ఒక రాన్సమ్ నోట్ లభించింది. దీంతో పోర్టల్ సేవల్లో అంతరాయం, హ్యాకింగ్ వ్యవహారంపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోర్టల్‌లోని కీలక డేటా ఏమైనా చోరీకి గురైందా అనే అనుమానాలపై TGCSB అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, పోర్టల్‌కు సంబంధించిన సమాచారమంతా సురక్షితంగా బ్యాకప్ రూపంలో ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.