Watch Video: పేరుకే అది కిరాణం షాపు.. కానీ అసలు కథ వేరు, షాకైన పోలీసులు!

|

Apr 15, 2024 | 7:11 AM

హైదరాబాద్ ను అడ్డగా మార్చుకొని స్మగ్లర్లు, దళారులు రెచ్చిపోతున్నారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మదకద్రవ్యాలు సప్లయ్ చేస్తూ అమాయకులను, విద్యార్థులను యూత్ ను మత్తుకు బానిసగా మార్చుతున్నారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతుండటంతో స్మగ్లరు కూడా రూటు మార్చుతూ యథేశ్చగా గంజాయిని సప్లయ్ చేస్తున్నారు.

Watch Video: పేరుకే అది కిరాణం షాపు.. కానీ అసలు కథ వేరు, షాకైన పోలీసులు!
Chocolates
Follow us on

హైదరాబాద్ ను అడ్డగా మార్చుకొని స్మగ్లర్లు, దళారులు రెచ్చిపోతున్నారు. డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మదకద్రవ్యాలు సప్లయ్ చేస్తూ అమాయకులను, విద్యార్థులను యూత్ ను మత్తుకు బానిసగా మార్చుతున్నారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతుండటంతో స్మగ్లరు కూడా రూటు మార్చుతూ యథేశ్చగా గంజాయిని సప్లయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గంజాయిన వివిధ రూపాల్లో చేరవేస్తున్న స్మగ్లర్లు.. రూటు మార్చి చాకెట్ల రూపంలో గంజాయిను సరఫరా చేస్తున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అవుతూ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. తాజాగా సిటీలో భారీస్తాయిలో గంజాయి చాకెట్లు పట్టుబడటం కలకలం రేపింది.

SOT మాదాపూర్ టీం & జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి రోడ్డు నెంబర్ 1 లో జయశ్రీ ట్రేడర్స్ (కిరాణా దుకాణం) లో సోదాలు నిర్వహించి దుకాణంలో అమ్ముతున్న 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్‌లు (26 కేజీలు), 4 కేజీల గంజాయి పొడిని స్వాధీనం చేసుకుని దుకాణ యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంజాయి చాక్లెట్స్, గంజాయి పొడిని కొలకత్తా కు చెందిన మోహన్ అనే వ్యాపారి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఉండగా, ఒక్కో ప్యాకెట్ ధర రూ. 1,000కు అమ్ముతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయి చాకెట్ల విలువ రూ.2,66,000. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.