Telangana Corona: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా  పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282కి చేరింది.

Telangana Corona: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..
Corona

Updated on: Jul 06, 2021 | 9:45 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా  పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282కి చేరింది. ఇందులో 11,455 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,13,124 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1028 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3703కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,05,186 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,92,74,985కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 32, జీహెచ్ఎంసీ 89, జగిత్యాల 21, జనగాం 19, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల్ 04, కామారెడ్డి 05, కరీంనగర్ 51, ఖమ్మం 30, ఆసిఫాబాద్ 08, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 50, యదాద్రి భోనగిరిలో 22 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : Breaking: విశాఖలో విషాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..

Loading...
Unable to load recommendations.
Follow Us