Telangana Corona: తెలంగాణలో కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

Telangana Corona: తెలంగాణలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా   పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కి చేరింది.

Telangana Corona: తెలంగాణలో కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

Updated on: Jul 05, 2021 | 7:34 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా   పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కి చేరింది. ఇందులో 11,704 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,12,096 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1061 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 7 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3698కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,03,398 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,91,69,799కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 31, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 23, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 16, గద్వాల్ 3, కామారెడ్డి 4, కరీంనగర్ 58, ఖమ్మం 59, ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 28, మంచిర్యాల 51, మెదక్ 6, మేడ్చల్ 35, ములుగు 21, నాగర్ కర్నూల్ 8, నల్గొండ 62, నారాయణపేట 4, నిర్మల్ 3, నిజామాబాద్ 7, పెద్దపల్లి 50, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 35, సంగారెడ్డి 09, సిద్ధిపేట 29, సూర్యాపేట 33, వికారాబాద్ 4, వనపర్తి 19, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 47, యదాద్రి భోనగిరిలో 23 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చీఫ్ కౌంటర్..

CoWIN Global Conclave: “వన్ ఎర్త్, వన్ హెల్త్” మేము నమ్ముతాం.. ఇప్పుడు ప్రపంచం విశ్వసిస్తోందన్న ప్రధాని

Follow Us