Telangana: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు వారి కోసమే.. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో నెంబర్ 2 కోసం ఎవరికి వారే పోటీపడుతున్నారు. తామే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నప్పటికి.. క్షేత్రస్థాయిలో టీఆర్ ఎస్ బలంగా ఉండటంతో ఇక టీఆర్ ఎస్ కు గట్టిపోటీ ఇచ్చే పార్టీలుగా..

Telangana: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు వారి కోసమే.. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Telangana CM K.Chandrasekhar Rao, Madhu Yashki
Follow us

|

Updated on: Sep 29, 2022 | 3:44 PM

తెలంగాణ రాజకీయాల్లో నెంబర్ 2 కోసం ఎవరికి వారే పోటీపడుతున్నారు. తామే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నప్పటికి.. క్షేత్రస్థాయిలో టీఆర్ ఎస్ బలంగా ఉండటంతో ఇక టీఆర్ ఎస్ కు గట్టిపోటీ ఇచ్చే పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ.. తెలంగాణలో టీఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే విధంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా బీజేపీకి దీటుగా తామే టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రచారం చేసుకుంటుంది. అయితే నెంబర్ 2 స్థానం కోసం టీఆర్ ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ గేమ్స్ మొదలుపెడుతున్నాయి. అయితే శాసనసభ ఎన్నికల కంటే ముందు మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగే ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల దృష్టి మునుగోడుపైనే పడింది. దీంతో పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరి వ్యూహలు వారు రూపొందిస్తున్నారు.

టీఆర్ ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. టీఆర్ ఎస్, కాంగ్రెస్ ఒకటే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా టీఆర్ ఎస్ వ్యవతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కమలం పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా తెలంగాణలో మూడు పార్టీల మధ్య రాజకీయ పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ టీఆర్ ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఏం కేసీఆర్ ను మధుయాష్కీ టార్గెట్ చేశారు. తెలంగాణ ను అదోగతి చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ రాజకీయ అడుగులు అన్నీ బీజేపీకి లబ్ది చేసేలా ఉన్నాయని ఆరోపించారు. జాతీయ పార్టీ అంటూ యుపిఎ భాగస్వామ్య పార్టీ నాయకులను కలుస్తున్నారని, బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలను కేసీఆర్ ఎందుకు కలవడం లేదని మధుయాష్కీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ను మరింత బలహీనపర్చేందుకే కేసీఆర్ జాతీయపార్టీ పేరుతో కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుస్తున్నారని మధుయాష్కీ  విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో ఏ కూటమి మనుగడ సాధ్యం కాదని తెలిపారు. కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని మధుయాష్కీ ఆరోపించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పోత్తు అనే బీజేపీ ప్రచారం అంతా తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకేనని.. ప్రజలు బీజేపీ అసత్య మాటలను నమ్మబోరని అన్నారు. లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ బీజేపీ కి అంతర్గత సహకారం అందిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మధుయాష్కీ. బీజేపీ, టీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం లో భాగంగానే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని మధుయాష్కీ పేర్కొన్నారు. దేశంలో అత్యంత మోసపూరిత సీఏం కేసీఆర్ అని శరద్ పవార్ తనతో గతంలో చెప్పారని మధుయాష్కీ ఈసందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్ని అసత్యాలని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నిజమే అయితే కేసీఆర్ అవినీతి పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు తెలంగాణలోని అన్ని వర్గాలు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మధుయాష్కీ కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..