బీఆర్ఎస్ జాతిపిత కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ రియాక్ట్.. ఏమన్నారంటే?

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ మరింతగా హీటెక్కుతోంది. జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా ? అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ.

బీఆర్ఎస్ జాతిపిత కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ రియాక్ట్.. ఏమన్నారంటే?
Cm Revanth Reddy On Father Of The Nation

Updated on: Feb 04, 2026 | 9:21 PM

జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా ? అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ.

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ మరింతగా హీటెక్కుతోంది. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న బీఆర్ఎస్ కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్.. కేసీఆర్, బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ ప్రశ్నించారు. వేరే వాళ్లు ఫోన్లు వినే వాళ్లు జాతిపితలా అంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత అని.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్‌ జాతిపిత అన్నారు.

అయితే సీఎం కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి హరీష్‌రావు. జాతిపిత అంటే రేవంత్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. తెలంగాణ కోసం రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా కొట్లాడారా? అని నిలదీశారు. తెలంగాణ జాతిపిత అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజులు ఉండటంతో ఈ అంశం రాజకీయంగా మరింత రగడకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..