Telangana: ఆ నేతకు గెలుపు ఒక వరం.. అయితే సొంత జిల్లాలో ఓటమి కలవరం..

సాధారణంగా సీఎం సొంత జిల్లాలో ఏ ఎన్నిక జరిగిన రాష్ట్రం మొత్తం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అందులోనూ పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలైతే ఎలాగైన గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతాయి. అయినప్పటికీ అధికారంలో ఉండడం, సీఎం సొంత జిల్లా సెంటిమెంట్‎తో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీన్ తారుమారవుతోంది. వరుస ఎన్నికల ఓటములు సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎంత కృషి చేసిన ఫలితం మాత్రం కిందమీద అవుతోంది.

Telangana: ఆ నేతకు గెలుపు ఒక వరం.. అయితే సొంత జిల్లాలో ఓటమి కలవరం..
Telangana Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 12:18 PM

సాధారణంగా సీఎం సొంత జిల్లాలో ఏ ఎన్నిక జరిగిన రాష్ట్రం మొత్తం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అందులోనూ పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలైతే ఎలాగైన గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతాయి. అయినప్పటికీ అధికారంలో ఉండడం, సీఎం సొంత జిల్లా సెంటిమెంట్‎తో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీన్ తారుమారవుతోంది. వరుస ఎన్నికల ఓటములు సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎంత కృషి చేసిన ఫలితం మాత్రం కిందమీద అవుతోంది.

సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా షాక్‎లు తప్పడం లేదు. మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, నేడు మహబూబ్‎నగర్ ఎంపీ ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సొంతగడ్డపై వ్యతిరేక పవనాలు సీఎం రేవంత్ రెడ్డిని తలెత్తుకోలేకుండా చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. మెజారీటీ ఎమ్మెల్యేలు ఉన్నా.. పార్టీ బలంగా కనిపిస్తున్నా ఓటములు తప్పడం లేదని పార్టీ శ్రేణుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. అసలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో ఈ అంశంపైనే హాట్‎గా చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డపై జరిగిన రెండు వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి ఆందోళనకు గురిచేస్తోంది. అటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్, ఇటు పార్లమెంట్ ఎన్నిక రెండింటిలో ఓటమితో మొత్తం క్యాడర్ డీలా పడిపోయింది. స్వయంగా సీఎం రెవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినా వ్యతిరేక ఫలితం రావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‎కు ఘోర ఓటమి తప్పలేదు. బలం లేకున్నప్పటీకి బరిలోకి దికి 200 ఓట్లతో గెలుస్తామని కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఫలితం మాత్రం షాక్ ఇచ్చింది. 109ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచి సీఎం అంచనాలను తారుమారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మనిషిగా పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టికెట్ కేటాయించారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం, జిల్లాలో 14మంది ఎమ్మెల్యేల్లో 12కాంగ్రెస్‎కు చెందిన వారే ఉండడం, ఓటమితో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడిపోయాయని ఇక విజయం నల్లేరుమీద నడకే అనుకున్నారు అంతా. స్థానిక సంస్థల్లో పార్టీకి బలం లేకపోవడంతో చేరికలు, క్రాస్ ఓటింగ్ పైనే హస్తం నాయకత్వం ఆధారపడింది. ఈ తరుణంలో ఎన్నికను సవాల్‎గా తీసుకొని.. ఎలాగైన సరే మన్నే జీవన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విడతల వారీగా సమీక్షలు సైతం జరిపారు. కానీ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ రిజల్ట్ మాత్రం నెగటివ్‎గా వచ్చింది.

అన్నిసార్లు ప్రచారం చేసినా.. తప్పని ఓటమి:

ఇక మహబూబ్‎నగర్ పార్లమెంట్ స్థానాన్ని అత్యంత కీలకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పర్యటించనన్ని సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ముందు, వెనక అన్ని తానై మద్దతు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‎కు చెందిన వారే ఉండడం వారితో నిత్యం సమీక్షలు నిర్వహించారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరయ్యారు. నేతలు, కార్యకర్తలతో నేరుగా సంప్రదింపులు చేసినప్పటికీ తుదిఫలితంలో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కేవలం మూడు నియోజకవర్గాల నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ రావడం సీఎం రేవంత్ రెడ్డిని కలవరపెడుతోంది. ఓడితే సీఎం కుర్చీకే ప్రమాదం, పాలమూరు అభివృద్ధికే ఆటంకం అని సెంటిమెంట్ రాజేసిన పోలింగ్ రోజున ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్ రాలేదు. ఏది ఏమైనా చివరకు సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ఎంపీ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలిఎన్నిక, అందులో సొంతజిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ బైపోల్, అనంతరం ఎంపీ ఎన్నిక రెండింటిలో పరాజయం సీఎం రేవంత్ రెడ్డిని కలవలరపెడుతోందట. ఓ పక్క మిగిలిన జిల్లాల్లో అభ్యర్థులు భారీ మెజారీటితో విజయాన్ని కైవసం చేసుకుంటే సీఎం సొంత జిల్లాలో దారుణ ఓటములు పార్టీ పరువు తీస్తున్నాయని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!