Hyderabad: లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..

హైదరాబాద్‌ చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో దారుణం వెలుగు చూసింది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో డీఆర్‌డీఓ ఉద్యోగి రామ్మోహన్‌పై దాడికి పాల్పడ్డారు స్థానికలు.. దాడిలో తీవ్రంగా గాయపడిన రామ్మోహన్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
Hyderabad Chikkadpally Incident

Edited By:

Updated on: Oct 22, 2026 | 4:54 PM

హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో డీఆర్‌డీఓ ఉద్యోగి రామ్మోహన్‌పై దాడి జరగగా.. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. రామ్మోహన్‌ తన నివాసానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో నివసించే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన పక్క ఫ్లాట్‌లోని వ్యక్తులు అక్కడికి చేరుకుని రామ్మోహన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రామ్మోహన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిపై అత్యాచారయత్నం జరిగిందన్న ఆరోపణలు, రామ్మోహన్‌పై దాడికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us