Viral Video: హైవేపై ఘోరం.. కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లన కారు.. ఒళ్లు గగుర్పొడిచే భయానక వీడియో..

అసలే.. హైవే.. రయ్య రయ్యిన దూసుకొస్తున్న వాహనాలు.. ఇలా ఒకటా.. రెండా.. వేలాది వాహనాలు నిత్యం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పరుగులు తీస్తుంటాయి.. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదమే.. అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.. తాజాగా.. అతి వేగం భార్యాభర్తల ప్రాణాలను బలితీసుకుంది.

Viral Video: హైవేపై ఘోరం.. కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లన కారు.. ఒళ్లు గగుర్పొడిచే భయానక వీడియో..
Accident
Follow us

|

Updated on: Apr 22, 2024 | 8:58 PM

అసలే.. హైవే.. రయ్య రయ్యిన దూసుకొస్తున్న వాహనాలు.. ఇలా ఒకటా.. రెండా.. వేలాది వాహనాలు నిత్యం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పరుగులు తీస్తుంటాయి.. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదమే.. అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.. తాజాగా.. అతి వేగం భార్యాభర్తల ప్రాణాలను బలితీసుకుంది. కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లగా.. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా మున‌గాల మండ‌లం ముకుందాపురం స‌మీపంలో సోమ‌వారం ఉద‌యం చోటుచేసుకుంది. ఆగివున్న కంటైనర్ వెనుక వైపుగా వేగంగా దూసుకొచ్చిన కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. కారులో ప్ర‌యాణిస్తున్న భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

కారు పూర్తిగా.. కంటైనర్ కిందకు దూసుకెళ్లగా.. మృత‌దేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన దృశ్యాలు.. అక్క‌డున్న పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లన కారు.. వీడియో

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను నవీన్ రాజా (29), భార్గ‌వి (24)గా గుర్తించారు. వీరిద్ద‌రూ హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కారులో ప్ర‌యాణిస్తున్న వారు నిద్ర మ‌త్తులో ఉండ‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌ంగా.. పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?