Big News Big Debate: కేంద్రంలో అధికారంపై కేసీఆర్‌ భరోసా ఏంటి…? ఆయన ముందున్న ఆప్షన్లు ఇవేనా..?

|

Jan 18, 2023 | 7:05 PM

ఖమ్మం గుమ్మం నుంచి సమరశంఖం పూరించారు KCR. దేశానికి BRS అవసరం ఏంటో చెబుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేస్తాం అన్నదీ స్పష్టంగా వివరించారు..ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ... దేశాన్ని కష్టాల నుంచి విముక్తి చేసేందుకు పుట్టేందే BRS అని చెప్పారు.

ఖమ్మం వేదికగా లక్షలాదిమంది ప్రజానీకం ముందు బీఆర్ఎస్‌ అజెండా, పాలసీలను వెల్లడించారు. పార్టీ సమగ్ర విధానం త్వరలోనే ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ కోర్‌ అజెండా మాత్రం వెల్లడించారు. సంక్షేమం, జాతీయికరణ మా విధానం అని తేల్చేశారు. సమగ్రాభివృద్ధికి కావాల్సిన నివేదికలు, పాలసీలు రూపొందిస్తున్నామన్న సీఎం కేసీఆర్‌ దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి తీరుతామన్నారు. BJP, RSSల నుంచి ప్రజాస్వామ్యానికే కాదు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. మోదీని ఇంటికి పింపితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా దేశ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని.. 2024లో ప్రజలు మరోసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.

Follow us on