సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికవాడగా పేరుపొందిన ముత్తంగి గ్రామంలో ఉంటున్న సుధీర్ గౌడ్ అనే వ్యక్తి ప్రధాన నేరస్తునిగా గుర్తించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే సుధీర్ గౌడ్ అనే వ్యక్తిది మెదక్. కాగా జీవనోపాధి కోసం బీరంగూడలో నివాసం ఉంటూ.. డబ్బు సంపాదన మీద దురాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి, అతని తమ్ముడు ప్రభుగౌడ్లు కమిషన్కు కల్లులో కలిపే నిషేదిత అల్ప్రాజోలం మత్తు మందును అమ్మే అనుభవంతో 2017లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని, అతని నుంచి అల్ప్రాజోలం తీసుకొని అమ్మేవారు. 2020లో గుమ్మడిదలకు చెందిన సాయిగౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుంచి అల్ప్రాజోలం కొని అమ్మేవాళ్లు. ఆ తర్వాత విశాల్ గౌడ్ ముత్తంగికి చెందిన బీశ్వేశ్వర్ సింగ్ను పరిచయం చేయగా, అప్పటి నుంచి వీరందరూ కలిసి ఈ నిషేదిత అల్ప్రాజోలం వ్యాపారం చేస్తూ.. కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోగా, ఆ వ్యాపారంలో అధిక లాభాలను చూసి, సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
బీశ్వేశ్వర్ సింగ్కు అల్ప్రాజోలంను తయారు చేసే పద్దతి తెలుసని సొంతంగా అల్ప్రాజోలంను తయారు చేసి అధిక డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో.. 2023లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 39 గల దానిలో లక్ష్మణ్ గౌడ్, సాయి ప్రియ కెమికల్స్ కంపెనీని కొనాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేశ్వర్ శర్మను, బీశ్వేశ్వర్ సింగ్ పరిచయం చేయగా ముగ్గురు కలసి 2023 మే నెలలో లక్ష్మణ్ గౌడ్ కంపనీని కొనుగోలు చేసి, అట్టి కంపెనీలో నిషేదిత అల్ప్రాజోలంను తయారు చేసే మిషనరిని ఏర్పాటు చేసుకొని, సుధీర్ డ్రైవరు బోడ శశి కుమార్ సహాయంతో అల్ప్రాజోలం తయారికి కావాల్సిన ముడిపదార్దాలను కొనుగోలు చేసి, ఒక బ్యాచ్ -50 కిలోల చొప్పున, నెలకు 1-2 బ్యాచ్ ల అల్ప్రాజోలంను తయారు చేసి కేజి 4 లక్షల చొప్పున హైద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మరియు కామారెడ్డి జిల్లాలలో అమ్మి అధిక డబ్బును సంపాదించేవాడు.
లండన్లో పీజీ చేసిన శశి కుమార్ అనే వ్యక్తి ఈ ఆల్ఫోజం తయారీకి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని చేయడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం సుధీర్ గౌడ్ తగు తయారుచేసిన అల్పోజల్ అన్ని మెదక్ వైపు అమ్మడానికి తీసుకుని వెళుతుండగా పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేసి విచారణ జరపడంతో బయటకు వచ్చింది. దీనితో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. వీరిని పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేయగా.. విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ దందాతో వీరు మొత్తం 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా బెట్టారు. వీళ్ల దందా మొత్తం చూస్తే ఓ క్రిమినల్ వెబ్ సిరీస్ తరహాలో సాగింది. ప్రధాన నిందితుడు సుధీర్ బిజినెస్ చేసే స్టయిల్ వేరే లెవల్.. వాడి పేరు కూడా ఎవరికి తెలియకుండా కోడ్ భాషలోనే బిజినేస్ చేసాడు. ఇక సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల దాదాపు 60 కోట్ల రూపాయలతో భూములు, విల్లాలు ఇండ్లను కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వాటిని సీజ్ చేశారు పోలీసులు.
ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి