Telangana: బర్రె పోయిందని గ్రామ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా బయటపడ్డ ఘోరం..

| Edited By: Ram Naramaneni

Jan 12, 2025 | 12:04 PM

మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. మహిళలు కనిపించగానే క్రూరుల్లా మారిపోతున్నారు కామాంధులు. తాజాగా రాజ్యంగ నిర్మాత సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: బర్రె పోయిందని గ్రామ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా బయటపడ్డ ఘోరం..
Gang Rape
Follow us on

ఎన్ని చట్టాలు వచ్చిన అత్యాచారాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.. కామంతో కొందరి కళ్లు మూసుకుపోతున్నాయి..మతిస్థిమితం లేని మహిళలను కూడా వదిలిపెట్టడం లేదు.. అలాంటి దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది..ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేని ఓ మహిళ.. రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి.. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న ఆమె కనిపించేసరికి.. తీసుకెళ్లి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల, ఒకరి తరవాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ఈ దారుణానికి పాల్పడిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్న విషయం నిందితులు గుర్తించలేదు.

కాగా గ్రామంలో 10వ తేదీన స్వామి అనే వ్యక్తి బర్రె తప్పిపోగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బర్రె మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు మతిస్థిమితం లేని మహిళను మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..