Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో వారిని హాస్పిటల్‌ తరిలించారు అధికారులు.

Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..
Food Poisoning At Bellampalli Girls School

Edited By:

Updated on: Jul 23, 2026 | 3:04 PM

మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల హాస్టల్‌  దారుణ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో వడ్డించిన ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన కాసేపటికే విద్యార్థినులకు వాంతులు, వికారం, తీవ్ర కడుపునొప్పి ప్రారంభం కావడంతో వెంటనే వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితేప్రాథమిక చికిత్స అనంతరం కొందరు విద్యార్థినుల పరిస్థితి మెరుగుగా ఉండడంతో వారిని రాత్రి తిరిగి  మళ్లీ హాస్టల్‌కు పంపించారు. అయితే ఇవాళ ఉదయం మళ్లీ పలువురికి వాంతులు, వికారం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.

ఇక ఈ  సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us