మంత్రిగారి మనవడి టిక్‌ టాక్ నిర్వాకం..ఫైరవుతోన్న నెటిజన్లు

టిక్..టాక్..ఈ యాప్ జనాల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో తెలీదు కానీ.. అనర్థాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మద్యనే టిక్ టాక్ కోసం ఫీట్‌లు ట్రై చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారిని చూశాం. ఇక రీసెంట్‌గా ఖమ్మం కార్పోరేషన్‌లో టిక్ టాక్ మోజులో పడి ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయిస్‌ని మర్చిపోనేలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియో ఒకటి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ వివాదాస్పద వీడియోలో హోం మంత్రికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం( టీఎస్ 09 పీఏ9999 )పై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *