మారని మంథని పోలీసుల తీరు.. హైకోర్టు ఆగ్రహం

ఈ నెల 25 న రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానితంగా సంచరిస్తుండటంతో మంథని పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలిసుల విచారణలో వారంతా అడవిలో జంతువుల వేటకు వెళుతున్నట్టు తేలింది. అయితే వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రంతా స్టేషన్‌లోనే...

మారని మంథని పోలీసుల తీరు.. హైకోర్టు ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 8:55 PM

దేశ వ్యాప్తంగా మంచి పేరున్న తెలంగాణలో.. ఈ పోలీస్ స్టేషన్ మాత్రం నిత్యం వార్తల్లో ఉంటుంది. ఘటన చినదైనా.. పెద్దదైనా ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలి ఎవరికి అంతుచిక్కదు. ఒకటి కాదు రెండు కాదు పదే పదె ఆ పోలీసుల పైనే అందరి విమర్శలు. ఇంతకీ మేము చెప్తున్నది ఏ పోలీస్ స్టేషన్ అనుకుంటారా…!! అదే మంథని పోలీస్ స్టేషన్.

ఈ నెల 25 న రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనుమానితంగా సంచరిస్తుండటంతో మంథని పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలిసుల విచారణలో వారంతా అడవిలో జంతువుల వేటకు వెళుతున్నట్టు తేలింది. అయితే వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. మరుసటి రోజు అందరినీ ఇంటికి పంపించారు. అయితే ఈ నలుగురిలో ఒకడైన శీలం రంగయ్య కనిపించలేదు.

నలుగురితో పాటు అరెస్ట్ అయిన రంగయ్య అతనితో పాటు అరెస్ట్ అయిన వారు ఇంటికి వచ్చినా తన భర్త ఇంటికి రాకపోవడంతో మిగతా వారిని ప్రశ్నించింది రంగయ్య భార్య. విషయం తెలుసుకుని ఆమె ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న రంగయ్య మృత దేహం వద్దకు వెళ్లింది. పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే తన భర్త ఆత్మ హత్య చేసుకున్నాడని రంగయ్య భార్య ఆరోపించింది. తన భర్త మృతికి కారణమైన మంథని పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన హై కోర్ట్ మంథని పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటన పై పూర్తి విచారణ చేసి నివేదికను హై కోర్ట్‌కు సమర్పించాలని ఆదేశించింది. విచారణ అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను నియమించింది హై కోర్ట్. విచారణ తదనంతరం పోలీస్ సిబ్బంది పాత్ర ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి హైకోర్టుతో పాటు రాష్ట్ర డీజీపీకు సమర్పించాలని ఆదేశించింది. కాగా హై కోర్ట్ ఆదేశాలతో రంగంలోకి దిగారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. మరి ఈ విచారణలో పోలీసుల పాత్ర ఉందో లేదో తేలనుంది.

ఇది కూడా చదవండి:

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు