Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రక్షణ మంత్రిత్వ శాఖ లో సీనియర్ అధికారి కి కరోనా పాజిటివ్. ఆ అధికారికి కరోనా పాజిటివ్ రావడం తో పెద్ద సంఖ్యలో రక్షణ శాఖ అధికారులు కరోనా టేస్ట్ లు చేపించుకున్నట్లు అధికారులు వెల్లడి. కరోనా వచ్చిన అధికారికి కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ హోమ్ క్వారం టైన్ అయినట్లు వెల్లడి.
  • టీవీ9 తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సిటీ బస్సుల పై ఈ నెల 8 తరువాత నిర్ణయం. సిటీ ఆర్టీసీ పైన ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోన వ్యాప్తి లో తగ్గుదల కనిపిస్తేనే సిటీ లో బస్సులు తిరుగుతాయి.
  • విశాఖ: విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై హత్యాయత్నం కేసు. 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. పాతకక్షలు, విభేదాలే హత్యాయత్నానికి కారణం. తాజాగా యువకుల మధ్య జరిగిన వివాదం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని పోళిసుల అనుమానం. ఘటనలో 6 నుంచి 9 మంది పాల్గొన్నట్టు ప్రాధమికంగా నిర్ధారణ. గ్రామ వాలంటీర్ల పాత్రపైనా కూపీ లాగుతున్న పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న సత్యనారాయణ, నాగేంద్ర, నవీన్.
  • అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్ట్ కు నివేదిక సమర్పించిన ఏపీ ప్రభుత్వం. ఎల్‌జీ పాలిమర్స్‌కు ఎన్‌వోసీ ఇవ్వలేదు, కంపెనీని సీజ్‌ చేశాం, డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసామని నివేదిక సమర్పించిన ప్రభుత్వం.
  • తిరుమల: శ్రీవారి దర్శనాల పునరుద్ధరణపై రేపు టీటీడీ ఉన్నతాధికారుల సమావేశం. శ్రీవారి తొలి దశ దర్శనాలలో శఠారి, తీర్థం రద్దు చేసి యోచనలో టీటీడీ. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాల సందర్శనను నిషేధించనున్న టీటీడీ. భక్తులు శ్రీవారి హుండీని తాకకుండా కానుకలు హుండీలో వేసేలా చర్యలు తీసుకోనున్న టీటీడీ. ఆలయ పరిసరాలను, వస్తువులను భక్తులు తాకకుండా చర్యలు తీసుకోనున్న టీటీడీ. ఆలయంలోని వకులా మాతా దర్శనం, లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలను నిలిపివేసే యోచనలో టీటీడీ.

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త ..సంక్రాంతికి సమ్మె జీతం..

Telangana: TSRTC employees to get salaries for strike period, ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త ..సంక్రాంతికి సమ్మె జీతం..

ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో  202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయనున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను చెల్లించింది యాజమాన్యం. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు రిలీజ్ చేసింది ఆర్టీసీ యాజమాన్యం.

 

Related Tags