ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి..! అధికారుల వెన్నులో వణుకు పుట్టించాడు..?

మహబూబాబాద్ జిల్లా గూడూరులో మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా అనేకంటే రసవత్తరంగా సాగిందని చెప్పాలి. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సమావేశం జరిగి ఉండదు.

ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి..! అధికారుల వెన్నులో వణుకు పుట్టించాడు..?
Follow us

|

Updated on: Oct 01, 2020 | 4:27 PM

మహబూబాబాద్ జిల్లా గూడూరులో మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా అనేకంటే రసవత్తరంగా సాగిందని చెప్పాలి. 39 గ్రామాలకు సంబంధించి, అది కూడా ఆరు నెలల తర్వాత జరిగిన మండల సర్వసభ్య భేటీ. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సమావేశం జరిగి ఉండదు. ఒక్కొక్క అధికారి సిత్రాలు, వారి పని తీరును స్థానిక ఎమ్మెల్యే సభలోనే కడిగిపారేశాడు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుకు కూడా సిఫార్సు చేశారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎంటా స్టోరీ అనుకుంటున్నారా..అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

మహబూబాబాద్ జిల్లా గూడూరులో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు తనదైన శైలిలో క్లాస్‌ తీసుకున్నారు. మల్సూర్ అనే విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నాడని కిషన్ అనే ఎంపిటీసీ సభ్యుడు ఆరోపించాడు. మరోమారు లంచాల ప్రస్తావన వినిపించినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా తానే స్వయంగా “కరెంట్ షాక్” పెడుతానని విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించాడు.

అడవులను కాపాడాల్సిన ఆ శాఖాధికారులు అడవులను నరికివేస్తున్నారని, పొనుగోడు సర్పంచ్ వెంకన్న నిండు సభలో ఆరోపించాడు. తన వద్ద ఆధారాలున్నాయని తెలపడంతో అటవీ శాఖాధికారులపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యాడు. పద్దతి మార్చుకోవాలనీ హెచ్చరించాడు. పంచాయతీరాజ్ శాఖా ఏఈ ఇరవై సంవత్సరాలుగా గూడూరు లోనే పని చేస్తూ, విధులలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడనీ సభ్యులందరు ముక్తకంఠంతో ఫిర్యాదు చేయడంతో ఏఈ ని సస్పెండ్ చేస్తానని సభ్యులకు ఎమ్మెల్యే హామి ఇచ్చాడు.

సభలో వెైద్యాధికారులపై కూడా ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశాడు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేయక పోవడంతో ఇద్దరు మిషన్ భగీరథ అధికారులను సస్పెండ్ చేయాలని సభ తీర్మానించింది. గ్రామీణ ఉపాధి హామి అధికారికి కూడికలు, తీసివేతలు సరిగా రావడం లేదని, గణితం నేర్చుకోవాలని ఎమ్మెల్యే సెటైర్ వేశారు. కోవిడ్ కారణంగా ఈ సారి సమావేశం బహిరంగ ప్రదేశంలో నిర్వహించడంతో స్థానికులంతా వీక్షించారు. అధికారులను ఎమ్మెల్యే మందలిస్తుంటే, స్థానికుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే అంటే గీ తీరున ఉండాలి. అధికారుల వెన్నులో వణుకు పుట్టించాడంటూ స్థానికులు ఎంతగానో ప్రశంసించారు.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..