జయప్రకాష్ నారాయణ పై సీఎం కేసీఆర్ ఫైర్..

మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. మిషన్ భగీరథ అద్భుత ఫలితాలనిస్తుందన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీరే తమ లక్ష్యమని.. త్వరలోనే ఆ కల నెరవేరబోతుందన్నారు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని ఒడిసా అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పై జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి జేపీ అని ఫైర్ అయ్యారు. […]

జయప్రకాష్ నారాయణ పై సీఎం కేసీఆర్ ఫైర్..
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 6:36 PM

మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. మిషన్ భగీరథ అద్భుత ఫలితాలనిస్తుందన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీరే తమ లక్ష్యమని.. త్వరలోనే ఆ కల నెరవేరబోతుందన్నారు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని ఒడిసా అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పై జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి జేపీ అని ఫైర్ అయ్యారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జేపీకి తెలుసా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు రాజకీయ లబ్ది కోసమే పలు పార్టీల నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజిని సకాలంలో నిర్మించి ఈ సీజన్ కు అందించిన ఎల్ అండ్ టి సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇక సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు పాల్గొన్నారు.