తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం సంపాదించే మార్గాల మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేందుకు.. ఈ నెల 18న ప్రగతి భవన్ […]

తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: Feb 16, 2020 | 11:43 PM

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం సంపాదించే మార్గాల మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేందుకు.. ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లను ఆహ్వానించనున్నారు. ఆదివారం సాయత్రం ప్రగతి భవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం 6 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. పట్టణ ప్రగతి నిర్వహణపై కేబినెట్ భేటీ లో విస్తృత చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యమన్నారు. ఇందుకు పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలన్నారు. పట్టణాల్లో పచ్చదనం-పారిశుధ్యం వెల్లివిరియాలన్నారు. ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని.. పౌరులకు మెరుగైన సేవలు అందాలన్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. పట్టణాభివృద్ధికి ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ లో మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

  • ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం
  • ఈ నెల 18న ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు
  • సదస్సుకు ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లకు ఆహ్వానం
  • పురపాలక సదస్సులో పట్టణప్రగతి విధివిధానాలు ఖరారు
  • అదే రోజు గజ్వేల్‌లో మార్కెట్, స్మశానవాటికను సందర్శించనున్న బృందం
  • వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి, ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారి
  • జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్ల నిధులు కేటాయింపు
  • రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయం
  • లోకాయుక్త చట్టసవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం
  • బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించిన సీఎం
  • అభయ హస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగింత
  • భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపొద్దని..
  • కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ కేబినెట్
  • చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని వినతి
  • లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఉన్న సిటిజెన్‌షఇప్ యాక్టును..
  • రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ కేబినెట్.. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం
  • తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయం