Window File Protection: కంప్యూటర్‌లో మీ ఫోల్డర్స్‌ను ఎవరూ ఓపెన్ చేయొద్దా? అయితే, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Window File Protection: మొబైల్‌లో ఫైళ్లకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్లుగానే.. కంప్యూటర్‌లోనూ ఆయా ఫైళ్లకు సెక్యూరిటీ పాస్ వర్డ్స్ సెట్ చేసుకోవచ్చు.

Window File Protection: కంప్యూటర్‌లో మీ ఫోల్డర్స్‌ను ఎవరూ ఓపెన్ చేయొద్దా? అయితే, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
File Protection

Updated on: Jul 31, 2022 | 8:31 PM

Window File Protection: మొబైల్‌లో ఫైళ్లకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్లుగానే.. కంప్యూటర్‌లోనూ ఆయా ఫైళ్లకు సెక్యూరిటీ పాస్ వర్డ్స్ సెట్ చేసుకోవచ్చు. అయితే, Windows మీ ఫైల్స్, ఫోల్డర్స్ లను ప్రొటెక్ట్ చేయడానికి పటిష్టమైన ఇంటర్నర్ ఫీచర్స్‌ అందిస్తోంది. అదే ఫైల్ ఎన్‌క్రిప్షన్. ఈ ఎన్‌క్రిప్షన్ సెలక్షన్ మీ ఫైల్‌ను, ఫోల్డర్‌లలోని డేటాను సేఫ్‌గా ఉంచుతుంది. ఫాస్‌వర్డ్‌ సెట్ చేసిన ఫోల్డర్, ఫైల్ మీరు లేదా, ఆ పాస్‌వర్డ్ తెలిసి వారు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు.

ఫైల్ ఎన్‌క్రిప్షన్ ప్రయోజనాలేంటంటే..
1. ప్రైవేట్ వర్క్ ఫోల్డర్‌లు, ఫైల్స్‌కు ప్రొటక్షన్ ఇస్తుంది.
2. పాస్‌వర్డ్‌ని సెట్ చేసిన ఫైల్‌ను ఇతరులతో షేర్ చేసినా.. అది ఓపెన్ అవదు.
3. పాస్ వర్డ్ తెలిసిన వారు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు.

ఫైల్ ఎన్‌క్రిప్షన్ ఎలా?
1. ఫైల్ మేనేజర్‌కి వెళ్లి, పాస్‌వర్డ్‌ సెట్ చేయాలనుకుంటున్న ఫైల్, ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
2. మౌస్‌ రైట్ క్లిక్ చేసి డ్రాప్-డౌన్ మెనులో ‘ప్రాపర్టీస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
3. ‘జనరల్ ట్యాబ్’లో ‘అడ్వాన్స్‌డ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
4. ‘కంప్రెస్, ఎన్‌క్రిప్ట్ అట్రిబ్యూట్స్’ మెను కింద ఉన్ ‘ఎన్‌క్రిప్ట్ కంటెంట్స్ టు సెక్యూర్ డేటా’ అనే బాక్స్‌ని టిక్ చేసి ‘OK’ బటన్ క్లిక్ చేయాలి.
5. ఆ తరువాత ‘అప్లై’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
6. ఆ తరువాత వచ్చే పాప్-అప్ మెను నుండి ‘ఓన్లీ ఫైల్ ఎన్‌క్రిప్షన్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, ‘Ok’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
7. మళ్లీ ‘OK’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ప్రాపర్టీలను క్లోజ్ చేయాలి.
8. మీ పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్, ఫోల్డర్‌లో లాక్ కనిపిస్తుంది.

ఫైల్ లేదా ఫోల్డర్‌ను డీక్రిప్ట్ చేయడం ఎలా?
1. మీ ఫైల్, ఫోల్డర్‌ను డీక్రిప్ట్ చేయడానికి ఫైల్‌పై రైట్ బటన్ క్లిక్ చేయాలి.
2. డ్రాప్-డౌన్ మెను నుండి ‘ప్రాపర్టీస్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
3. ఆ తరువాత మెనూ నుంచి ‘అడ్వాన్స్‌డ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
4. ‘ఎన్‌క్రిప్ట్ కంటెంట్స్ టు సెక్యూర్ డేటా’ పక్కన ఉన్న ‘చెక్ మార్క్‌’ను తీసేయాలి.
5. ఆ తరువాత ‘OK’ క్లిక్ చేసి ‘Apply’ క్లిక్ చేయాలి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..