Aadhaar Authentication History : గత ఆరునెలల్లో ఆధార్ కార్డుని ఎన్ని సార్లు ఉపయోగించారో తెలుసుకోవడం ఎలా అంటే..!

|

Mar 01, 2021 | 4:48 PM

ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఒక్కరి జీవితానికి ఆధార కార్డు ఆధారమయ్యింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. దీంతో ఆధార్ తో మనకు అనేక ...

Aadhaar Authentication History : గత ఆరునెలల్లో ఆధార్ కార్డుని ఎన్ని సార్లు ఉపయోగించారో  తెలుసుకోవడం ఎలా అంటే..!
Follow us on

Aadhaar Authentication History : ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఒక్కరి జీవితానికి ఆధార కార్డు ఆధారమయ్యింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. దీంతో ఆధార్ తో మనకు అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది పొందేందుకు, ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు, బ్యాంక్ ఖాతాలు ఇలా అనేక అవసరాలకు ఆధార్ ఉపయోగపడుతుంది.

ఆధార్ కార్డు కు ప్రతి ఒక్కరు తమ మొబైల్ నెంబర్ ను కచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి. ఇక గత 6 నెలల కాలంలో ఆధార్‌ను ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో తెలుసుకునే సదుపాయాన్ని కూడా యూఐడీఏఐ అందిస్తోంది. మరి ఆరునెలల్లో ఆధార్ ను ఎలా ఉపయోగించారో ఈజీగా ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ముందుగా ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం అందులో ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం జనరేట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది.

అనంతరం అక్కడ కనిపించే పేజీలో ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారు, ఎంత వ్యవధిలోని లావాదేవీలను చూడాలనుకుంటున్నారు.. అనే వివరాలను నమోదు చేయాలి.. అనంతరం మన మొబైల్ కి వచ్చిన ఓటీపీని.. ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తేదీ, సమయం, ఆధార్ ఆథెంటికేషన్ రిక్వెస్ట్ లు తెరపై ప్రత్యక్షం అవుతాయి.

ఇలా ఆధార్‌ను గత 6 నెలల సమయంలో ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో సులభంగా తెలుసుకోవచ్చు. దీని వల్ల మన ఆధార్ కార్డులను మనం కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా, లేదా.. అనే వివరాలు తెలుస్తాయి. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి మన ఆధార్ కార్డు లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తప్పని సరిగా ఉండాల్సిందే.

Also Read:

బ్రతుకే భారం అనుకున్న వారికి భరోసా.. హెచ్‌ఐవీ జంటకు పెళ్లి జరిపించారు.. అంతా తానై నిలిచిన జిల్లా కలెక్టర్

SBI Reduced Interest Rate: గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ