WhatsApp: వాట్సప్ నుంచి మరో స్టన్నింగ్ ఫీచర్.. చాట్ ఓపెన్ చేయకుండానే అన్నీ ఒకేచోట..

వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. అదే ఆన్ లైన్ స్టేటస్. ఫేస్ బుక్ తరహాలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కాంట్రాక్ట్స్ వివరాలు ఒకేచోట కనిపించనున్నాయి. దీంతో ప్రత్యేకంగా ఛాట్ తెరవాల్సిన అవసరం ఉండదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండూ వెర్షన్లలో దీనిని పరీక్షిస్తోంది.

WhatsApp: వాట్సప్ నుంచి మరో స్టన్నింగ్ ఫీచర్.. చాట్ ఓపెన్ చేయకుండానే అన్నీ ఒకేచోట..
Whatsapp

Updated on: May 22, 2026 | 1:35 PM

ప్రముఖ సోషల్ మీడియా షార్ట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మీ కాంటాక్ట్‌లోని వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నాడా..? లేడా? అనేది చెక్ చేయాలంటే సదరు వ్యక్తి చాట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వ్యక్తుల వివరాలను ఒకేచోట ప్రదర్శించనుంది. ఫేస్‌బుక్ మెస్సేంజర్ తరహాలోనే ఒకేచోట ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపించనున్నాయి. ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తుల వివరాలను సులభంగా చూసుకునేందుకు వీలుగా వాట్సప్ ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.

కాంటాక్ట్స్ హబ్

ఈ కొత్త ఫీచర్‌లో ప్రత్యేకమైన కాంటాక్ట్స్ హబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వ్యక్తుల వివరాలను చూడవచ్చు. అండ్రాయిడ్, ఓఎస్ రెండూ వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత అండ్రాయిడ్ వెర్షన్ 2.26.13.3లో పరీక్షించారు. ఇక ఇప్పుడు యాపిల్ టెస్ట్ ఫ్లైట్ ప్రొగ్రాం ఐఓఎస్ 26.20.10.70లో కూడా కనిపిస్తోంది. స్నేహితులు, కుటుంబసభ్యులు అందుబాటులో ఉన్నారా. లేదా అనేది ఒకే ఫ్లాట్‌ఫామ్‌లో చూసుకునేందుకు ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. కమ్యూనికేషన్‌న మరింత సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సెట్టింగ్ ఆన్ చేసుకుంటేనే..

ప్రస్తుతం చాట్ విండో తెరిచిన తర్వాత కాంట్రాక్ట్ ఆన్ లైన్ స్టేటస్ కనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో లేకపోతే చివరిసారిగా చాట్‌లోకి వచ్చిన టైమ్ కనిపిస్తుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఆఫ్ చేసుకుంటే ఆన్ లైన్ స్టేటస్ కనిపించదు. దీని వల్ల వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తిని కనిపెట్టడం కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సప్ ప్రత్యేక కాంటాక్ట్స్ విభాగాన్ని అభివృద్ది చేస్తోంది. సెట్టింగ్స్‌లో ప్రొఫైల్ ఫొటోల విభాగం కింద ఇది కనిపిస్తుంది. నచ్చిన వ్యక్తుల కాంటాక్ట్‌లు పైన చూపిస్తాయి. చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తుల జాబితాను ప్రదర్శిస్తుంది. ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్స్ వివరాలు ప్రొఫైల్ ఫొటో మూలలో ఉన్న గ్రీన్ స్టేటస్ బబుల్‌లో కనిపిస్తాయి. ఇక కాంటాక్ట్స్‌ను సలుభంగా కనిపెట్టేందుకు ఒక సెర్చ్ బార్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫన్ నెంబర్‌ను ఎంటర్ చేయడం లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కాంటాక్ట్‌లను నేరుగా జోడించవచ్చు. అయితే సెట్టింగ్స్‌లో ఆన్ లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ కనిపించకుండా ఆన్ చేసుకుంటే ఆన్ లైన్ కాంటాక్ట్స్ విభాగంలో కనిపించరు.

Follow Us