WhatsApp New Feature: ఇక వాటిని వాట్సాప్ స్టేటస్‌గా కూడా పట్టేసుకోవచ్చు.. భలే ఉంది కొత్త ఫీచర్..

ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తోంది. అదేంటంటే వినియోగదారులు వాట్సాప్ చానెల్స్ లో పెడుతున్న పోస్టులను తమ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకునే వెసులబాటును కల్పిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

WhatsApp New Feature: ఇక వాటిని వాట్సాప్ స్టేటస్‌గా కూడా పట్టేసుకోవచ్చు.. భలే ఉంది కొత్త ఫీచర్..
New Feature In Whatsapp
Follow us

|

Updated on: Feb 10, 2024 | 7:53 AM

వాట్సాప్.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్. ఇది ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్లు, అప్ డేట్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పటికే చాట్స్ తో పాటు స్టేటస్, చానెల్స్ ను పరిచయం చేసిన ఈ యాప్ వీడియో, ఆడియో కాల్స్, వీడియోకాల్స్ లో స్క్రీన్ షేరింగ్ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లను పరిచయం చేసింది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తోంది. అదేంటంటే వినియోగదారులు వాట్సాప్ చానెల్స్ లో పెడుతున్న పోస్టులను తమ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకునే వెసులబాటును కల్పిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ వాట్సాప్ చానెల్ ఫీచర్ గురించి వివరాలు ఆ కంపెనీ శుక్రవారం పోస్ట్ చేసింది. ఇప్పటి వరకూ వ్యక్తుల చానెల్ అప్ డేట్లు తమ చాట్స్ తో పాటు చానెల్ ను ఫాలో చేస్తున్న కాంటాక్ట్ లు చూసే వీలుంటుంది. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త అప్ డేట్లో ఈ చానెల్లో పెడుతున్న పోస్టులను వినియోగదారులు తమ స్టేటస్ లోకి కాపీ చేసుకొనే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. తద్వారా చానెల్లో పోస్ట్ అవుతున్న కంటెంట్ స్టేటస్ లోకి వెళ్లడం ద్వారా వాటి రీచ్ పెరుగుతుంది. వాట్సాప్ తన పోస్టులో ఈ విధంగా రాసింది. ‘ మీరు ఇష్టపడే కంటెంట్ మీరు ఇష్టపడే వ్యక్తులకు చూపండి.. తాజా వార్తలు, క్రీడా అప్ డేట్లు ఇలా ఏదైనా సులభంగా షేర్ చేయండి.’ కొత్త చానెల్ ఫీచర్ ఇలా ఉంటుంది.. ఫార్వర్డ్ టు స్టేటస్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సులభంగా మీరు ఇష్టపడిన చానల్ కంటెంట్ స్టేటస్ లోకి వెళ్తుంది.

చానెల్ పోస్ట్ ని స్టేటస్ గా ఇలా షేర్ చేయండి..

వాట్సాప్ చానెల్స్ స్పేస్ లోకి వెళ్లి మీరు షేర్ చేయాలనుకుంటున్న చానెల్ అప్ డేట్ ను నొక్కి పట్టుకోండి. వెంటనే మీకు కనిపించే ఫార్వర్డ్ బాణం గుర్తుని నొక్కండి. ఒకటి కంటే ఎక్కువ చానెల్ అప్ డేట్లు కూడా ఇక్కడ మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత మెనూ నుంచి స్టేటస్ ఆప్షన్ ను ఎంచుకొని గ్రీన్ కలర్ లో కనిపించే ఫార్వర్డ్ బటన్ ను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అలాగే మీ వాట్సాప్ స్టేటస్ కు చానెల్ లింక్ ను కూడా ఫార్వార్డ్ చేయొచ్చు. చానెల్ సమాచార పేజీ నుంచి ఫార్వర్డ్ నొక్కండి, ఆపై మై స్టేటస్ ను ఎంచుకోండి. అయితే నిర్ధిష్ట రకం చానెల్ అప్ డేట్లు మాత్రమే ఫార్వాడింగ్ ఫంక్షన్ కు స్టేటస్ లోకి వెళ్లేందుకు మద్దతు ఇస్తాయని వాట్సాప్ తెలపింది. ఇందులో టెక్ట్స్, లింక్స్, ఫొటోలు, జీఐఎఫ్, వీడియోలు ఉంటాయి. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. కంప్యూటర్ వెర్షన్లకు ఇంకా రాలేదని వాట్సాప్ పేర్కొంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..